Monday, October 15, 2007

భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'


అంబాజీ- గుజరాత్‌లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతూ 'అంబా భవానీ'గా పిలవబడుతున్న దివ్య క్షేత్రం. అతి పురాతనమైన ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఎటువంటి దేవతామూర్తి కనిపించదు. దేవతామూర్తి పీఠం అక్కడ ఉంది. వస్త్రాలు మరియు ఆభరణాలు అలంకరించిన తీరు అక్కడ దేవతామూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. 'జయ అంబే' అంటూ భక్తులు సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ఉంటుంది.


ఈ అమ్మవారి కరుణాకటాక్షవీక్షణలతోనే రుక్మిణి, శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తలనీలాలు సమర్పించుకున్నాడని భక్తుల విశ్వాసం. అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు 'లోక్ మేలా' పేరిట ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అంబాజీ మాతను భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు. విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత...


మరో చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ముమైత్


'పోకిరి' చిత్రం ద్వారా ఐటంగర్ల్‌‌గా తెలుగు చిత్ర రంగం ప్రవేశం చేసిన ముమైత్ ఖాన్.. చిన్నగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అనే పాటతో యువతను ఉర్రూతలూగించిన ముమైత్.. ఆ తర్వాత 'ఆపరేషన్ దుర్యోధన', 'ఎవడైతే నాకేంటి' చిత్రాల్లో నటించింది.


ఈ చిత్రాల్లో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆమె హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. త్వరలో విడుదల కానున్న 'మైసమ్మ ఐపీఎస్' చిత్రంలో ముమైత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకమునుపే...