Tuesday, September 2, 2008

వినాయకుని ఆకారం... సంకేతాలు



బొజ్జ గణపయ్య ఆకృతిపై ఎన్నో రకాల చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం లాంటి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలుగా చెప్పుకోవచ్చు.వినాయకుడి ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉంటుందని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ఇష్టమైన అంశం.


ఓంకార రూపంలో రకరకాల ఆకృతుల్లో కొలువైన ఓంకార వినాయకుడి బొమ్మలు కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. ఎంతోమంది సృజనాత్మక కళాకారులు బొజ్జ గణపయ్య రూపాన్ని తమ కుంచెలతో ప్రతిష్టించారు.వినాయకుని తొండము "ఓం"కారానికి సంకేతం కాగా...ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము కాగా...చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము.


ఇంకా చదవండి

Thursday, April 3, 2008

కంత్రీ ట్రెయిలర్

వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న కంత్రి చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌గా పేరున్న అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా... దేశముదురు ఫేమ్ హన్సిక, బాలీవుడ్ కథానాయిక కాజోల్... సోదరి అయిన తనీషా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొన్ని విశేషాలున్నాయి.


దేశముదురు తర్వాత టాలీవుడ్‌కే రానని తేల్చి చెప్పిన హన్సిక.. తిరిగి రావడం ఒకటైతే.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేయటం మరో విశేషం...


మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి