Saturday, September 15, 2007

శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలు


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సందర్శించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము ప్రకటించిన బ్రహ్మోత్సవ వివరాలను ఈ దిగువ ఇస్తున్నాము. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించండి. 14-9-07 అంకురార్పణము/ శ్రీసేనాధిపతి ఉత్సవము... రాత్రి 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు 14-9-07 సర్వ దర్శనము... ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు 14-9-07 సర్వ దర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు



15-9-07 విశ్వరూప సర్వదర్శనము... తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు 15-9-07 బంగారు తిరుచ్చి ఉత్సవము... మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.30 గంటల వరకు 15-9-07 ధ్వజారోహణము...


విఘ్నేశ్వర వ్రత కథ


శౌనికాదిమునులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతము, చంద్రుని చూచినచో కలిగే దోషం మరియు దోష నివారణను సూతమహాముని చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం ఏనుగు రూపంలోని ఒక రాక్షసుడు పరమశివునికై ఘోరంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నడైన శివుడు రాక్షసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.


శివుని చూసి పరమానందభరితుడైన ఆ రాక్షసుడు భక్త సులభా నీవు ఎల్లప్పుడూ నా కడుపులో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరాడు. శివుడు తథాస్తు అన్నాడు. ఈ సంగతి తెలియని పార్వతి, భర్త జాడ తెలియక మహావిష్ణువుకు మొరపెట్టుకుంది. పార్వతి వేదనను తీర్చుటకై గజాసురుని కడుపులోని శివునికి విముక్తి కలిగించేందుకు నందిని...