Wednesday, September 17, 2008

'మెగా' రాష్ట్ర పర్యటనకు రంగం సిద్ధం..!

జన హోరులో తడిసి ముద్దయ్యేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. తన తొలి రాజకీయ బహిరంగ సభను అశేష జనవాహిని మధ్య దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయేలా నిర్వహించారు. అదేరీతిలో తన రాష్ట్ర పర్యటనను నిర్వహించాలని మెగాస్టార్ సన్నిహితులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా ఈనెలాఖరు నుంచి మెగా రాష్ట్ర పర్యటన ప్రారంభమవుతుంది.

ముఖ్యంగా వచ్చే 27, 28, 30 తేదీల్లో ఏదో ఒక రోజు నుంచి శ్రీకారం చుట్టొచ్చని ప్రజారాజ్యం పార్టీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ యాత్ర ప్రారంభ ప్రాంతంపై భిన్నకథనాలు వినొస్తున్నాయి. చిరంజీవి తన రాజకీయ ప్రవేశం రాయలసీమ ప్రాంతం నుంచి చేశారని, అందువల్ల రాష్ట్ర పర్యటన మాత్రం కోస్తాంధ్ర నుంచి చేపట్టాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. మరికొందరు మాత్రం బాగా వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ నుంచి నిర్వహించాలని సూచిస్తున్నారు...


ఇంకా చదవండి

Tuesday, September 2, 2008

మెగాస్టార్ ప్రజారాజ్యం ఆవిర్భావం



తాను నాయకుడిని కానని జన సేవకుడిగా మిగిలిపోవాలన్నది తన అభిమతమని చిరంజీవి తెలిపారు. ఆయన చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..... ప్రజా సేవ కోసం ఆహ్వానం వచ్చింది. ప్రజల ఆహ్వానం నిండుగా మెండుగా ఉంది. వాళ్ళ పిలుపుపై ఆత్మస్థైర్యం. అబ్దుల్ కలాం చెప్పారు. సేవ తత్పరత భావం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని....



మరిన్ని వివరాలకు వెబ్‌దునియా తెలుగు చూడండి