Saturday, August 25, 2007

యమగా ఉన్న 'యమగోల'


నటీనటులు: శ్రీకాంత్, వేణు, మీరాజాస్మిన్, రీమాసేన్, కృష్ణభగవాన్, రమ్యశ్రీ, నరేష్, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, శివాజీ రాజా తదితరులు. నిర్మాతలు: అమర్, రాజశేఖర్, సతీష్.దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి


కథ: సీనియర్ నరేష్ దంపతులకు లేకలేక ఓ పాప పుడుతుంది. ఓ గురువు వద్దకు తీసుకెళితే ఆమె అదృష్టవంతురాలనీ, ఐశ్వర్య అనే పేరు పెడితే మీ కంతా ఐశ్వర్యమే అంటాడు. వీరు వెళ్ళాక పక్కనే ఉన్న ఓ వ్యక్తితో గురువు అసలు విషయం చెబుతాడు. అదృష్టవంతురాలైన 22 ఏళ్ళకే చనిపోతుందని.


ఆ తర్వాత గురువు చెప్పినట్లు ఆమెతో పాటే ఆస్తి పెరుగుతుంది. కట్‌చేస్తే యమలోకం. యముడు (కైకల సత్యనారాయణ) వృద్ధుడవుతాడు. అందుకే ఆయన వారసునిగా యువ యముడ్ని (శ్రీకాంత్) పట్టాభిషిక్తుడ్ని చేసి మొదటి బాధ్యతగా ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు...


Thursday, August 23, 2007

ఎమ్మెస్ రాజు చిత్రం 'వాన'లో మీరా చోప్రా


హీరో పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ మీరా చోప్రా. నిర్మాతలను పలు ఇబ్బందులకు గురి చేస్తుందనే అపవాదును మూటగట్టుకుంది. గతంలో..పారితోషకాన్ని ఇవ్వలేదన్న కారణంగా 'సత్యం శివం సుందరం' చిత్ర నిర్మాతలపై మీరోచోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.


ఈ నేపథ్యంలో ఎమ్మెస్ రాజు తాజాగా నిర్మించే 'వాన' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో తమిళ హీరో వినయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇదిలావుండగా మీరా చోప్రా...


Wednesday, August 22, 2007

రాష్ట్ర రాజధానిలో మెగాస్టార్ 53వ జన్మదిన వేడుకలు


ఆంధ్రుల అభిమాన నటుడు, మెగాస్టార్ చిరంజీవి 53వ జన్మదిన వేడుకలు బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగాయి. అత్యవసర పనిమీద చిరంజీవి లండన్‌కు వెళ్లడంతో బర్త్‌డే వేడుకలు ఆయన కుటుంబసభ్యుల సమక్షంలో జరిగాయి.


ఇక్కడి శిల్పకళా వేదిక వద్ద జరిగిన ఈ వేడుకల్లో హీరో పపన్ కళ్యాణ్, నాగబాబుతో పాటు.. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. తన బర్త్‌డే సందర్భంగా అభిమానులకు చిరంజీవి ఓ సందేశాన్ని లండన్‌ నుంచి పంపించారు.

Tuesday, August 21, 2007

నాగదోష నివారణ


మీ జాతకంలోని గ్రహ సమ్మేళనాలు మీ అభివృద్ధిని నిరోధిస్తున్నాయా?... అవి మిమ్మల్ని సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నాయా?.. లేకుంటే మీకు కీడు చేస్తున్నాయా?.... ఇలాంటి విషయాలపై వ్యాఖ్యానించడం చాలా కష్టమే...ఇదంతా పూర్తిగా అర్ధ రహితమని కొందరు కొట్టి పారేస్తుంటారు.


కానీ 21వ శతాబ్దంలో సైతం ఇటువంటి అంశాలపై విశ్వాసం చూపేవారు వేల సంఖ్యలోనే ఉన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న గ్రహ సమ్మేళనాలలో ‘నాగ దోషం’ ఒకటి. ‘ఏది నిజం’కు కొనసాగింపుగా, ‘నాగదోషం’ తాలూకూ హానికర ప్రభావాల నివారణార్థం వేల సంఖ్యలో భక్తులు విచ్చేసే నాసిక్‌కు చెందిన త్రయంబక్ గ్రామాన్ని మా తదుపరి గమ్యస్థానంగా ఎంచుకున్నాం.


త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి


శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాశిక్‌కు 35 కిలో మీటర్ల దూరంలోని ‘త్రయంబక్’ అనే ఓ కుగ్రామంలో వెలసి ఉంది. ఈ గ్రామంలో అడుగుపెట్టగానే మీరు ఆధ్యాత్మిక భావనకు లోనవుతారు.


మహామృత్యుంజయ మంత్ర జపంతో అక్కడి వాతావరణం మొత్తం మారుమోగుతూ పూర్తి ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది. ఆ గ్రామంలో ప్రవేశించి అలా కొద్ది దూరం నడిస్తే, మీకు ఆలయ ప్రధాన ద్వారం...


Sunday, August 19, 2007

దీపావళికి అలరించనున్న ఘటోత్కచ


సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సూర్వదేవర వినోద్ నిర్మాతగా రూపొందిన ఘటోత్కచ యానిమేషన్ చిత్రం దీపావళినాడు విడుదలకానుంది. 100 నిమిషాల నిడివిగల ఈ సినిమా ఏడు భాషల్లో విడుదలవుతుంది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని సన్ ఏనిమిటిక్స్ అండ్ షిమారూ ప్రొడక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.