Wednesday, November 14, 2007

అసిన్ బాలీవుడ్ అనుభూతి


గజిని, తమిళ 'పోకిరి' చిత్రాలతో ఉన్న ఫళంగా తన పారితోషికాన్ని, ఇమేజ్‌ని పెంచుకున్న సెక్సీతార అసిన్. ఈ పూబంతి ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో మహా బిజీగా ఉంది.


అంతేకాదండోయ్... అక్కడ ఓ ఇల్లును కూడా కొనేసింది. ఇక దాదాపు అక్కడే సెటిలైనట్లే కదా... అని అడిగితే, "కాదు కాదు, నేను దక్షిణాది అమ్మాయిని. నా ప్రిఫరెన్స్ దక్షిణాదికే. ఇల్లు కొన్నంతమాత్రాన...


ఘనమైన బాలల దినోత్సవం



పిల్లలూ దేవుడూ చల్లనివారే... కల్మషం లేని ఆ పసివారికోసం మన దేశంలో ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించబడుతోంది. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం కూడా అయిన ఈరోజున బాలల దినోత్సవాన్ని నిర్వహించటం.. బాలల పట్ల ఆయనకు గల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలే కారణం.


ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు.అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని...


Monday, November 12, 2007

అందరి దైవం నీవన్నా...


కార్తీకమాసంలో నాగులచవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. నాగుల చవితినాడు ఉపవాసం ఉండి పుట్టదగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పంచమినాడు బంగారంతోగానీ, వెండితోగానీ, కర్రతోగానీ, మట్టితోగానీ 5 పడగల పాములను చేయించుకునిగానీ, లేకుంటే పసుపు చందనాలతో సర్పముల చిత్రాలను గీచి, భక్తితో పూజించి పాలు, పాయసము నువ్వుల పిండి....


ఏడేళ్ళ బాలికకు జాతీయపురస్కారం


1330 సూక్తులను కలిగిన తిరుకురల్‌ను ఏడు సంవత్సరాల వయసు గల లావినశ్రీ ఏకధాటిగా ఆలపిస్తుంది. తన ప్రతిభాపాటవాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకోనున్న లావినశ్రీని జాతీయ ప్రతిభా పురస్కారం వరించింది.


2006 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిభను కనపరిచే బాలలను జాతీయ పురస్కారాలకు ఎంపిక చేసే కమిటీ ఎమ్. లావినశ్రీని ఎంపిక చేసింది. నగరంలోని పాఠశాలలో లావినశ్రీ మూడవ తరగతి చదువుతున్నదని ఆమె తండ్రి కె.మునిసామీ తెలిపారు. మూడు సంవత్సరాల వయస్సులోనే తిరుకురుల్ పట్ల మక్కువను...


Sunday, November 11, 2007

దీపావళి హాస్యానందం


మనసారా నవ్వుకోవటం రానురాను తగ్గిపోతోందని పరిశోధకులు వాపోతున్నారు. హృదయాన్ని తేలికపరిచే హాస్యాన్ని ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందనీ, ఫలితంగా అనేకానేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారంటున్నారు.


ఇటీవల చాలా చోట్ల లాఫింగ్ సెంటర్ల ప్రాధాన్యం పెరగటానికి కారణం ఈ నవ్వుకున్న ప్రాధాన్యం తగ్గిపోవటమే. ఈ నేపథ్యంలో సన్నివేశానుసారంగా మనసుకు...


లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల


ఆంజనేయ స్వామి భక్తులకు నయనానందం కలిగిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా విన్నూత్నమైన ప్రదర్శనశాల లక్నోలో ఏర్పాటైంది. ఆంజనేయ స్వామికి చెందిన అరుదైన వస్తువులతో నిండిన ఈ ప్రదర్శనశాల 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌'లో స్థానం సంపాదించుకుంది. ఈ బృహత్కార్యం సాకారం వెనుక హనుమత్ భక్తుడైన సునీల్ గొంబార్ కృషి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆంజనేయస్వామికి అనేక వస్తువులను సునీల్ సేకరించారు.


లక్నోలోని ఇందిరానగర్‌లో గల తన నివాసమైన 'బజ్‌రంగ్ నికుంజ్' మొదటి అంతస్తులో తను సేకరించిన వస్తువులను సునీల్ ప్రదర్శనకు ఉంచారు. శ్రీరామచంద్రుని 48 గుర్తులను కలిగిన 'చరణ్ పాదుక'(అడుగు జాడలు)ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా వెండితో అలంకరించబడి ఉన్నాయి. శ్రీరాముడు స్మరించిన హనుమంతుని సహస్ర నామాలను (వెయ్యి పేర్లు) కూడా మీరు...