సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు.
ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ-నట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు.
శాలీనుడనే పేరుగల నాయకుడుండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటిరాత్రి లోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలూ వాడిపోలేదు. ఏ దుస్తులు నలగలేదు. అసలు ఆమెలో కించిత్ మార్పు సైతం కానరాలేదు. ఒకటి.. రెండు.. మూడు రాత్రులు ఇదే రీతిలో గడిచిపోయాయి. రాత్రి వేళ ఆమె గదిలోకి వెళ్లడం... ఉదయాన ఎలా వెళ్లిందో అలానే తిరిగి రావడం జరిగింది. దాంతో ఆమె మానసికంగా కుంగి పోయింది. తన సౌందర్యాన్ని చూసి భర్తలో...
ఇంకా చదవండి