Friday, December 12, 2008

ప్రాణం పోసిన హిందూ హృదయం

రఘుపతి వస్తానని పోన్ చేశాడు. సరే, రారా . ఇంటివద్దే ఉన్నాను అన్నాను.ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఎటూ వెళ్లడంలేదు.మిత్రులుకూడా చాలామంది రావడం తగ్గించేశారు. ఎవరి పనులు వాళ్లకు.. సమయం సరిపోవడంలేదేమో.పనమ్మాయిని పిలిచి మేడమీద గది శుభ్రంచేయమన్నాను. ఆ గది నా సామ్రాజ్యం. అయితే అక్కడికి వెళ్లి చాలా వారాలయింది.

అంతకు ముందు ప్రతి శని, ఆదివారాలు నా మిత్రులతో, మేడపై గదిలో చాలా సరదాగా గడచిపోయేవి. కొందరితో పేక ఆట, కొందరితో చదరంగం, చందు, నాగరాజు వంటివారితో సాహిత్య చర్చ. ఇలా ఉండేది నా వారాంతపు జైత్రయాత్ర.

ఇంకా చదవండి

గజినీ వస్తున్నాడు... ట్రెయిలర్ చూడండి



క్రిస్మస్ కానుకగా దేశవ్యాప్తంగా విడుదలకానున్న అమీర్‌ఖాన్ "గజినీ" విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. గజినీ ట్రెయిలర్‌లో అమీర్ ఎమోషన్స్ చూసిన సినీ జనం, ఈ చిత్రం బిగ్ హిట్ అవుతుందని చెపుతున్నారు. తమిళ "గజినీ" చిత్రాన్ని రూపొందించిన ఎఆర్ మురుగదాస్ మరిన్ని మెరుగులు దిద్ది ఈ చిత్రాన్ని రూపొందించారని యూనిట్ సభ్యులంటున్నారు.


ఇక అమీర్‌ఖాన్ విషయానికి వస్తే... చిత్రం షూటింగ్ ప్రారంభించింది మొదలు అమీర్ "గజినీ" గెటప్పులోనే దర్శనమిచ్చాడు. తలపై సగం వెంట్రుకలు, తలకు ఒకవైపు దెబ్బ తగిలినట్లుండే ఆనవాళ్లు... అమీర్‌ఖాన్‌కి మంచి క్రేజ్‌నే తెచ్చాయి. ఇకపై ఇదే గెటప్‌తో అమీర్ తిరుగుతాడేమోనన్నంత స్థాయిలో అమీర్ గజినీ స్టయిల్ ఉంది మరి. నటి అసిన్‌కి సైతం అమీర్ "గజినీ" పుణ్యమా అని బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సులొస్తున్నాయి. అసిన్ నటనను అమీర్ స్వయంగా చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాడని భోగట్టా.


మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి