Monday, January 12, 2009

సత్యం రాజు మోసగాడా...?



ప్రపంచంలోని 66 దేశాలలో ఐటీ తెలుగు తేజం... సత్యంవిదేశాలలో పనిచేసే సాఫ్ట్‌వేర్ నిపుణులలో దాదాపు 40 శాతం మందిని తెలుగునేల నుంచి అందించిన సత్యంఇలా ప్రపంచ ఐటీ చిత్ర పటంలో క్రమంగా ఎదిగి ఒకనాడు ప్రపంచ ఐటీ రారాజు బిల్‌గేట్స్ సరసన కూర్చున్న మేటి సత్యం...తెలుగు యువతలో మనోధైర్యాన్ని నింపి... విదేశీ గడ్డపై తెలుగు యువత రాణించగలదనీ నిరూపించిన సంస్థ.


యువతకు కాసుల వర్షం కురిపంచిన సత్యం... ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రాజధానిగా సైబరాబాదును ప్రపంచానికి చాటిచెప్పింది. దాదాపు 60 వేల కుటుంబాలకు... కూడు, గుడ్డ, నీడనిస్తూ... తెలుగు యువతకున్న మేధా సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఏకైక సత్యం సామ్రాజ్యాధినేత బైర్రాజు రామలింగరాజు...


మరింత సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి

వెంకీ ఖాతాలో మరో నంది



విక్టరీ వెంకటేష్‌‌ కెరీర్‌లో మరో నంది అవార్డు చేరింది. తాను నటించిన "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యాడు. 2007 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు సోమవారం ప్రకటించింది. ఇందులో ఉత్తమ చిత్రంగా "మీ శ్రేయోభిలాషి" ఎన్నికైంది. ద్వితీయ చిత్రంగా "హ్యాపీడేస్", తృతీయ చిత్రంగా "లక్ష్యం" ఎంపికైంది.


అలాగే ఉత్తమ దర్శకుడుగా కృష్ణవంశీ (చందమామ), 'మంత్ర' చిత్రంలో అద్భుత నటనతో ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమలో ప్రశంసలను అందుకున్న హీరోయిన్ ఛార్మికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే.. ఉత్తమ సంగీత దర్శకునిగా.. మిక్కీజే మేయర్ (హ్యాపీడేస్), ఉత్తమ గాయకుడిగా కార్తీక్ (హ్యాపీడేస్), ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా ఆహుతి ప్రసాద్ (చందమామ), ఉత్తమ వినోదాత్మక చిత్రంగా "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..", ఉత్తమ కుటుంబ చిత్రం "చందమామ" ఎంపికైంది.


మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి