Wednesday, November 28, 2007

కృష్ణభగవాన్, సిమ్రాన్‌ల జాన్ అప్పారావ్ 40+


శ్రీవరసిద్ది వినాయకస్వామి సమర్పణలో రూపొందుతున్న జాన్ అప్పారావ్ 40+ చిత్రం బ్లాక్ అండ్ ఎయిట్ యాక్ట్ పతాకంపై చిత్రీకరిస్తున్నారు. కూచిపూడి వెంకట్ స్వీయ దర్శకత్వ సారథ్యాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వెంకట్ నిర్మిస్తున్నారు. కృష్ణభగవాన్, సిమ్రాన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుపుకుంటోంది.


నవంబర్ వారాంతంలో రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తున్నామని దర్శకనిర్మాత చెప్పారు. బ్యాంకాక్, పట్టాయ్, థాయ్‌లాండ్, పుకెట్ ఐలాండ్‌లలోని అందమైన లొకేషన్‌లలో పాటలు తీస్తున్నామని చెప్పారు. అలాగే మరో పాటను రామోజీ ఫిలిం సిటీలో సెంట్ సాంగ్ తెరకెక్కించడంతో...


ప్రమాణ స్వీకారం చేసిన ముషారఫ్


పాకిస్తాన్ దేశాధ్యక్షుడిగా పర్వేజ్ ముషారఫ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముషారఫ్ దేశాధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీకి ముందు ముషారఫ్ దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చెల్లదని కోరుతూ దాఖలైన పిటీషన్లు అన్నింటిని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ముషారఫ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టయింది.


ఈ సందర్భంగా ముషారఫ్ ప్రసంగిస్తూ.. దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి త్వరలోనే అధికమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా...


Sunday, November 25, 2007

ప్రియతమా... ఇదే నా ఆహ్వానం


-యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు


ఈ చల్లని వెన్నెల

ఈ పచ్చని పైరు

ఈ సెలయేటి గలగలలు

ఈ చిరుగాలి సవ్వడులు


నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్

ఎన్నాళ్లీ ఎడబాటు

ఎన్నాళ్లో ఈ విరహ వేదన

ఎంతకాలం ఈ ఎదురుచూపు...


"కృష్ణార్జున"లుగా యువసామ్రాట్, విష్ణు


పి.వాసు దర్శకత్వంలో నాగార్జున, విష్ణు నటిస్తున్న చిత్రానికి "కృష్ణార్జున" అనే టైటిల్‌ను ఖరారు చేసారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ప్రేక్షకులే ఎంపిక చేసినట్టు దర్శకుడు వాసు వెల్లడించారు. దీనిపై చిత్ర హీరోలలో ఒకరైన విష్ణు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి "మిత్రమా" అనే టైటిల్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నాం. అయితే.. ఎక్కువ మంది ప్రేక్షకులు "కృష్ణార్జున" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సరైన కథ లభించినట్టయితే.. "మిత్రమా" అనే టైటిల్‌తో చిత్రాన్ని చేస్తామన్నారు.


ఈ చిత్రంలో నటించేందుకు అడిగిన వెంటనే నాగార్జున గారు అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫాంటసీ చిత్రం. ఇందులో నేను సూపర్ హీరోగా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి...