Thursday, October 11, 2007

ఆన్‌లైన్ ద్వారా మీనాక్షి అమ్మవారి దీవెనలు


ప్రపంచంలో ఎక్కడ నుంచైనా మధుర మీనాక్షి అమ్మవారి దీవెనలను అందుకునే సౌకర్యాన్ని మీనాక్షి దేవస్థానం కల్పించింది. ఇంట్లోనుంచే ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించే అవకాశాన్ని ఇటీవల దేవస్థానం కల్పించింది.


భక్తులు రూ. 500 నుంచి రూ.2250 చెల్లించి పూజ లేదా అభిషేకాన్ని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. అయితే తొలిగా ఈ సౌకర్యాన్ని అందించిన ఘనత తిరుమల తిరుపతి దేవస్థానదే. మధుర మీనాక్షి అమ్మవారికి పూజలను ఆన్‌లైన్ ద్వారా అందజేసే సౌకర్యాన్ని...


తొలిషెడ్యూల్‌ పూర్తయిన "నితిన్" సినిమా


నితిన్, మమతా మోహన్‌దాస్, సింధుతులాని, శశాంక్ ప్రధాన తారాగణంగా, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న నితిన్ చిత్రం తొలి షెడ్యూల్ గురువారంతో పూర్తవుతుంది. ఈ విషయాన్ని నానక్‌రామ్ గూడాలోని సిలీవిలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నానాక్‌రామ్ గూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ నెల 3 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభమయిందని చెప్పారు. నితిన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు. "సామాన్యుడు" చిత్రం తర్వాత దర్శకుడు చాలా కసితో చేస్తున్న ఈ చిత్రం అందరికీ పేరు తెస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రవి. సి. కుమార్ విలేకరులతో మాట్లాడుతూ... కథానుగుణంగా బడ్జెట్‌కు పరిమితం లేకుండా, వర్కింగ్ డేస్ నిబంధనలు లేకుండా నిర్మాత చక్కని సహకారం అందించారని చెప్పారు. ప్రేమ, యాక్షన్...


Wednesday, October 10, 2007

ఏప్రిల్ నుంచి రూ. 2 బియ్యం: వైఎస్


వచ్చే సంవత్సరం జనవరి లేదా ఏప్రిల్ మాసం నుంచి రెండు రూపాయలకే కిలో బియ్యం పధకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారందరికీ పై పధకాన్ని వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాల ప్రారంభం నిమిత్తం చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం వైఎస్ పర్యటించారు. మరో రెండేళ్ళలో రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ...


మీ ఫ్యాషన్ శైలిని మెరుగుపరుచుకోండి


ఫ్యాషన్‌గా కనిపించాలంటే కేవలం ఫ్యాషన్ వస్త్రాలు ధరిస్తే సరిపోదు. వస్త్రాలతో పాటు మీరు కూడా ఫ్యాషన్‌గా కనపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పట్టణాలలోను, నగరాలలలోనూ నివసించే మహిళలు ఫ్యాషన్‌గా కనిపించడానికి కొన్ని చిట్కాలను పాటించవలసి ఉంటుంది. పదుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపేందుకు ఊతమిచ్చే ఫ్యాషన్ చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము.


మీరు లావుగా ఉన్నట్లయితే, స్లీవ్‌లెస్ కట్‌లకు గుడ్‌బై చెప్పండి. తేలికపాటి షేడ్స్‌ను వదిలి గాఢమైన రంగులతో కూడిన వస్త్రాలను అలా కాకుండా తేలికపాటి షేడ్స్‌ను మాత్రమే ధరించాలని మీరు కోరుకున్నట్లయితే...


తరుణ్ సరసన 'పోకిరి' భామ


తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు వెల్లువలా వస్తున్న హీరోయిన్లలో ఇలియానా ఒకరు. అయితే.. వచ్చిన అవకాశాలను అంగీకరించేందుకు ఆమె ససేమిరా అనండంతో తెలుగుకు స్వస్తి పలికినట్టేనని కొందరు భావించారు. దీంతో ఇలియానా కల్పించుకుని, తనకు ఓ ఇమేజ్‌ను, గుర్తింపును ఇచ్చిన తెలుగు పరిశ్రమను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో యువహీరో తరుణ్‌తో ఓ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ప్రధాన పాత్రను...


అమెరికాలో "గానగంధర్వుని"కి సత్కారం


కర్నాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను అమెరికా కాంగ్రెస్ సత్కరించింది. శాస్త్రీయ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఒక ప్రశంసాపూర్వక పత్రాన్ని అమెరికా కాంగ్రెస్ విడుదల చేసింది.


ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి నిక్ ల్యాంప్సన్ టెక్సాస్‌లో మీడియాతో మాట్లాడుతూ...బాలమురళీకృష్ణను భారతీయ సంగీతానికి చెందిన "లెజెండ్‌"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా లాంగ్ ఐలాండ్ సమీపంలో శ్రీవారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ...


Tuesday, October 9, 2007

ఆయన తమిళ కోహినూర్ వజ్రం: నమిత


'శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విక్రమ్. నటనలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తమిళ చిత్ర రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ తెలుగులో నటిస్తున్న చిత్రం 'మల్లన్న' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా.. ఆరు అడుగుల అందంతో తమిళ చిత్ర సీమలో సెక్సీతారగా గుర్తింపు పొందిన నటి నమిత.


ఆమె ఇటీవల తమిళ హీరోలపై తన మనస్సులోని మాటలను చెప్పింది. సియాన్ విక్రమ్ తమిళ చిత్ర రంగానికి దొరికిన కోహినూర్ వజ్రమని నమిత వ్యాఖ్యానించింది. చిత్రమేమంటే నమిత ఇంకా విక్రమ్‌తో ఒక్క సినిమా కూడా చేయక పోవడం విశేషం. అయినా విక్రమ్ అంటే నమితకు విపరీతమైన...


Monday, October 8, 2007

సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా


అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గా భారత దేశంలోని అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ముస్లీం పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్నది. సర్వమతాల ప్రజల భక్తివిశ్వాసాలను ఈ దర్గా చూరగొంటున్నది. ముస్లీం మతాచార్యుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ సమాధి చెందిన స్థలమే అజ్మీర్ షరీఫ్ దర్గాగా రూపాంతరం చెందింది.


భారత్ మరియు పాకిస్థాన్ దేశాలలోని అత్యంత ప్రముఖమైన సూఫీ సంఘాలకు చెందిన చిస్టీ సూఫీ పరంపరను హజ్రత్ మొయినుద్దీన్ చిస్టీ వ్యవస్థాపించారు. తమ ధార్మిక చింతన, ఆకర్షణ శక్తి, దీవెనలు మరియు సేవల ద్వారా సూఫీ బోధకులు ఇస్లాం మతవ్యాప్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 1190 సంవత్సరం నుంచి...


మల్లెనవ్వుల అలివేణి


వెన్నెల అందాల విరబోణి

కలువరేకుల కమనీయవాణి

చేమంతుల సిరివేణి

మల్లె నవ్వుల అలివేణి


నీ స్నేహం

నాకు ఉత్తేజం

నీ ప్రోత్సాహం

నా విజయం...