Saturday, September 1, 2007

సంకష్టహర చతుర్ధి వ్రతం


శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే


ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటాం. ఈ శ్లోకంలో వినాయకుని తత్త్వం నిక్షిప్తమై ఉంది. ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్థి విఘ్నేశ్వరుని పూజకు ఉత్కృష్టమైన దినం. అదే విధంగా ప్రతి నెలా బహుళ చతుర్థినాడు సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలనీ, ఈ విధంగా 21 ఏళ్లపాటు...


Wednesday, August 29, 2007

చెలీ నీవైనా దరిచేరవా... నాకోసం!


యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు

గత కాల గమనంలోని

నీ తీపి గురుతులు

మరువలేను మరిచిపోను

ఆ తీయని స్వప్నం


దూరతీరాలు దాటి

కలుసుకోవాలని ఆశ

తెలుసు ఇది దురాశేనని

ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు...


ది మోస్ట్ లవ్లీ క్వీన్ లవ్‌స్టోరీ


వేల్స్ యువరాణి డయానా ప్రేమపురాణంలో అధ్యాయాలు అనంతం. ఆమె మాజీ భర్త ప్రిన్స్ చార్లెస్‌తో సహా పది మంది పురుషులు ఆమె ప్రేమను చవిచూసారంటే ఆశ్చర్యం కలిగించకమానదు. 1981వ సంవత్సరంలో ప్రిన్స్ ఛార్లెస్‌తో జరిగిన వివాహం మూడునాళ్ల ముచ్చటగా ముగియడంతో డయానాకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయ్యింది. ప్రిన్స్ చార్లెస్‌తో ప్రారంభమైన ఆమె ప్రేమయాత్ర మరణంలో సైతం తన వెన్నంటి వచ్చిన దోడి ఫయేద్‌తో ముగిసింది.


డయానా జీవితంలోకి ప్రవేశించి ఆమె తొలిప్రేమను అందుకున్న పురుషుడు ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్. ఇరువురి మధ్య అభిప్రాయబేధాలతో వారి ప్రేమకథ విడాకులతో ముగిసింది. విపత్కర పరిస్థితులలో తన భుజాలపై రోదించేంత సాన్నిహిత్యాన్ని డయానాతో ఏర్పరుచుకున్న...


వేల్స్ యువరాణి డయానా బాల్యం

డయానా ఫ్రాన్సెస్ స్పెన్సర్ ఇంగ్లాండ్‌లోని నార్‌ఫోల్క్ ప్రాంతంలోని సండ్రింగామ్‌లో గల పార్క్ హౌస్‌లో 1961వ సంవత్సరం జూలై ఒకటవతేదీన జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, విస్కౌంటెస్ అల్‌థార్ప్. సండ్రింగామ్‌లోని సెయింట్ మేరీ మాగ్డలెనే చర్చిలో బాప్టిజాన్ని స్వీకరించారు. తల్లిదండ్రులు విడాకులు పుచ్చుకోవడంతో డయానా తల్లి తన ఇరువురు పిల్లలను లండన్‌లోని నైట్‌బ్రిడ్జ్‌కు తరలించింది.

అక్కడే డయానా తన పాఠశాల విద్యకు శ్రీకారం చుట్టారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా తండ్రితో గడిపేందుకు డయానా ఆమె సోదరుడు వెళ్ళగా, వారిరువురిని వారి తల్లికి తిరిగి అప్పగించేందుకు డయానా తండ్రి నిరాకరించాడు. తన పిల్లలను తనకు అప్పగించాల్సిందిగా డయానా తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం డయానా తండ్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

తాతగారు మరణించడంతో డయానా తండ్రి ఎనిమిదవ ఎర్ల్ స్పెన్సర్‌గా రూపాంతరం చెందారు. అదేసమయంలో చిన్నారి డయానా లేడీ డయానా స్పెన్సర్‌గా మారారు. తదనంతరం చిన్ననాటి నుంచి నివసిస్తున్న పార్క్ హౌస్ టిని వదలి తన కుటుంబానికి చెందిన 16వ శతాబ్దంనాటి గృహానికి తరలి వెళ్లారు.

మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tuesday, August 28, 2007

పచ్చదనాన్ని పెంపొందించటమే నా బర్త్ డే స్పెషల్: నాగ్


చైన్ పట్టి 'శివ'లా నటించి, 'సంతోషం'గా హోమ్లీ పాత్రలను పోషించి, అన్నమయ్య', 'రామదాసు'ల్లా ఆ దైవాలను కీర్తించే పాత్రను చేసి నేడు 'డాన్'గా రానున్నాడు యువసామ్రాట్ నాగార్జున. అశేష తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29. ఈ సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ.....


ప్రశ్న: పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జునగారూ... ఈ పుట్టినరోజున ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు?

జ: ప్రతి పుట్టినరోజున నా స్టూడియోలోనే అభిమానులను కలుస్తుంటాను. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. అదంతా మా తృప్తికోసం చేస్తుందే. లాస్ట్‌ ఇయర్ 25వేల మొక్కలు నాటాం. వారి వారి ఇంటి దగ్గర, వారి వారి ఊళ్ళలో...


ఆరోగ్యం కంటే.. వృత్తే నాకు ముఖ్యం: నయనతార


తెలుగు, తమిళ చిత్ర సీమల్లో బిజీగా ఉండే హీరోయిన్లలో నయనతార ఒకరు. ఇటీవల తమిళ యువహీరోతో ప్రేమలో పడి కాస్త వివాదాల్లో చిక్కుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మకు తమిళంలో అడపాదడపా నటిస్తూ.. తెలుగులో పూర్తిగా దృష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న 'సెల్యూట్' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.


ఇంతలో నయనతారకు వైరల్ ఫీవర్ సోకడంతో అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ తన వల్ల చిత్రం షూటింగ్ ఆగిపోకూడని భావించిన నయన.. వైరల్ జ్వరంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీనికి చిత్రం యూనిట్ వర్గాలు ఆమెను అభినందించడమే కాకుండా.. విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట. అయితే అందుకు ససేమిరా అన్న నయనతార...


Monday, August 27, 2007

ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంలో కమిలినీ


ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నరేష్, శర్వానంద్, కమిలినీ ముఖర్జీ ముఖ్య తారాగణంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. సెప్టెంబరు 10 వరకూ నరేష్, శర్వానంద్ , కమిలినీ ముఖర్జీలపై సీతారామశాస్త్రి రాసిన మూడు పాటలను చిత్రీకరించనున్నారు.


వీరితోపాటు అభిషేక్, బ్రహ్మానందం కూడా పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను కూడా తీయనున్నారు. ఈ విషయాలను నిర్మాత జాగర్లమూడి సాయిబాబు చెబుతూ, జానకి కోసం ఇద్దరు అబ్బాయిలు సాగించే జీవన ప్రయాణం ఈ చిత్ర ఇతివృత్తమని....

నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం... సర్ప దోష నివారణం


మహాకాళ దేవుని మహా నగరం.. ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది. ఈ నగరంలో వీధికి ఒక దేవాలయాన్ని మీరు కనుగొనవచ్చు. కానీ నాగచంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉన్నది. మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అదీ 'నాగపంచమి' నాడు తెరవబడుతుంది.


సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు. నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు...