Friday, September 7, 2007

విదేశాలకు వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతి


కృష్ణ జింకల వేట కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ విదేశాలకు వెళ్లేందుకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు స్వీకరించింది. కృష్ణ జింకల కేసులో సల్మాన్‌కు ఐదేళ్ళ జైలు శిక్షను స్థానిక కోర్టు విధించగా... దాన్ని జోధ్‌పూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఖరారు చేసిన విషయం తెల్సిందే.


దీంతో సల్మాన్ జోధ్‌పూర్ పోలీసులకు లొంగిపోగా.. మూడు రోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం బాలీవుడ్ నటుడుకి రాజస్థాన్ హైకోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. ఈనేపథ్యంలో..


మిడ్డీ డ్రస్సుల్లో అందాలు ఆరబోస్తున్న ప్రియామణి


ప్రేక్షలను ఆలరించేందుకు కురుచ దుస్తుల్లో తన అందాలను ఆరబోయడానికి సైతం 'పెళ్లైన కొత్తలో..' చిత్రం హీరోయిన్ ప్రియామణి సిద్ధమయ్యారు. ఇటీవలి కాలంలో కురుచ దుస్తుల్లో కనిపిస్తూ.. చిత్ర పరిశ్రమ వర్గాలను, ప్రేక్షకులను మత్తెక్కిస్తున్న పలువురు హీరోయిన్లకు పోటీగా ప్రియామణి కూడా ఈ దుస్తుల పట్ల ఆకర్షితులవుతోంది.


ముఖ్యంగా హీరోయిన్లు త్రిష నుంచి టాబు వరకు మిడ్డీ డ్రస్సులతో వివిధ ఫంక్షన్లకు హాజరై.. ఆ ఫంక్షన్లకు ప్రత్యేక శోభను తెస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ కోవలో మలయాళ భామ ప్రియామణి కూడా...


Thursday, September 6, 2007

మాజీ ముఖ్యమంత్రి జనార్థన రెడ్డిపై హత్యాయత్నం


రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు నేదరుమల్లి జనార్థన రెడ్డి దంపతులపై శుక్రవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయన సొంత జిల్లా నెల్లూరులోని కోట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఓ కల్వర్టర్ దాటుతుండగా మందుపాతర పేలింది. ఈ పేలుడులో కారు డ్రైవర్‌తో సహా ఇద్దరు కార్యకర్తలు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.


శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నేదరుమల్లి జనార్థన రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. దాన్ని స్వీకరించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి, భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మితో కలసి జానార్థన రెడ్డి తిరుపతికి బయలుదేరారు. వారి కాన్వాయ్‌ వెంట సుమారు 20 కార్లు ఉండగా, ముందు వరుస నుంచి మూడో వాహనంలో నేదరుమల్లి దంపతులు ఉన్నారు. ఐదో కారు రాగానే కల్వర్టర్ కింది భాగంలో ఉంచిన మందుపాతర...


ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం


నాట్‌వెస్ట్ సిరీస్ కీలకమైన ఆరో వన్డే‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ అందించిన 317 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 3-3తో సమం అయింది.

12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఊతప్ప (47, 8 ఫోర్లు) చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి నాలుగు ఫోర్లతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్‌కు ఓపెనర్లు సౌరవ్ గంగూలీ (53), సచిన్ టెండూల్కర్ (94) మరోసారి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 150 పరుగులు జోడించారు.

తొలి వికెట్‌గా గంగూలీ వెనుదిరిగిన అనంతరం వచ్చిన గౌతం గంభీర్‌ (47) కాస్త తేడాతో అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆరు పరుగుల తేడాతో వన్డే‌ల్లో 42వ సెంచరీ చేజార్చుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సచిన్ భారత్ లక్ష్య సాధనలో...


మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Wednesday, September 5, 2007

ఇంటర్నెట్‌లో మాళవిక "శోభనం" దృశ్యాలు..!


తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సెక్వీ క్వీన్‌గా పేరుగాంచిన మాళవిక.. కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుని, సినిమాలకు స్వస్తి పలికింది. చిత్రం రంగంలో ఉన్నపుడు పలు హాట్ వార్తలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ మళయాల తార.. పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే వార్తలకెక్కుతోంది. పలువురు చిత్ర నిర్మాతలపైనే కాకుండా హీరోలపై ఆరోపణలు చేసిన మాళవిక ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం అప్పుడెప్పుడో హనీమూన్‌కి విదేశాలకు వెళ్ళారు.

తన శోభనం రాత్రి భర్తతో గడిపిన శృంగార సన్నివేశాలు ఇపుడు ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాట. భార్యాభర్తలు ఇద్దరు తప్ప మూడో వ్యక్తికి ప్రవేశం లేని శోభనం రాత్రి...

మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ బాంబు పేలుళ్ళ నిందితుని అరెస్టు


హైదరాబాదులోని లుంబిని పార్కులో బాంబును అమర్చి పది మంది మృతికి కారణమైన నిందితుని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) బెంగుళూరులో మంగళవారం అరెస్టు చేసింది. జంట పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ, మంగళవారం బెంగుళూరులో చేపట్టిన గాలింపు చర్యల్లో అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకుని ఉన్న రిజ్వాన్ ఘజీని అదుపులోకి తీసుకుంది.

స్థానిక పోలీసు వర్గాలు బుధవారం అందించిన సమాచారాన్ని అనుసరించి బాంబు పేలుళ్ళకు సంబంధించిన తన ఊహాచిత్రం వెలుగు చూడగానే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బెంగుళూరులో...

మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి