Tuesday, December 18, 2007

నా కళ్లే నా ప్లస్ పాయింట్స్


చారిడేసి కళ్లు... ముత్యాల్లాంటి పలువరుస... ఆకర్షణీయమైన శరీరాకృతి.... బాలీవుడ్ క్వీన్ దీపిక సొంతం. దీపిక అంటే ఎవరో.... అని అడిగేవారు బహుశా ఉండకపోవచ్చు. 'ఓం శాంతి ఓం' చిత్రం ద్వారా భారతీయ వెండితెరకు పరిచయమైన ఈ సెక్సీ రాణి తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలున్నాయని అంటోంది.


అచ్చమైన భారతీయ మహిళ ధరించే దుస్తులంటే పడుకునెకు అత్యంత ప్రీతిపాత్రం. పాశ్చాత్య మోడళ్లను అంతగా ఇష్టపడనని చెప్పినప్పటికీ జీన్స్, టీషర్టులు వేసుకోక తప్పటం లేదని బాధపడుతోంది. మరోవైపు చిత్రంలో పాత్రకు తగ్గట్లు దుస్తులను ధరించి తీరాల్సిందే కదా...


మంచులోకంలో విరిసిన మరుమల్లె


యిమ్మడిశెట్టి వెంకటేశ్వర్రావు


కుర్రాళ్లతో కాలేజీ నందనవనంగా ఉంది. ఆకాశాన్నంటే వృక్షాల నీడన బోయ్స్ అండ్ గాళ్స్ ఊసులాడుకుంటున్నారు. మరోవైపు తమకే తెలిసిన తీయని నవ్వులను కాలేజీ ప్రాంగణంలో విరబూయిస్తున్నారు అమ్మాయిలు. ఆ అందమైన నవ్వులు వెన్నెల తెచ్చిన వసంతంలా ఉంది. ఆరడగుల అందగాడుగా పేరుతెచ్చుకున్న నరేంద్రకు మాత్రం కోపం నషాలనికంటుతోంది. ఎందుకంటే అతనికి ఆడాళ్లంటే ద్వేషం. ఎందుకో... అని ఎవరైనా అడిగితే... రెండు ముక్కల్లో మాత్రం చెప్పడు. పరిచయంతో మొదలై దానికి మహాకావ్యం రూపు తెచ్చే ప్రయత్నం చేస్తాడు.


అందుకే అతనివద్ద అమ్మాయిల గొడవను ఎవరూ ఎత్తరు. ఆడాళ్లంటే తనకు ఉన్న అయిష్టతను ఎవరూ అడగకుండానే అందరి వద్ద ప్రకటించటం అతని దినచర్యలో ఓ భాగమైపోయింది. ఈ విషయం ఆ నోటా... ఆ నోటా అదే కళాశాలలో చదువుతున్న మల్లికను చేరింది. సృష్టికి మూలం స్త్రీయే అని అతనికి తెలియజెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది మల్లిక. ఈ మల్లిక ఓ చూపు విసిరితే... చాలు...


Friday, December 14, 2007

ముష్‌కు ఏకపాత్రాభినయం చాలు: పాక్ ప్రజలు


పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాలన పాక్‌కు ఎంతో అవసరమని అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టం చేశారు. అయితే.. ఆర్మీ పదవిలో ముషారఫ్ కొనసాగరాదని పాక్ ప్రజలు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ఆర్మీతో ఎలాంటి సంబంధాలు లేకుండా దేశ పరిపాలన చేయాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.


అంతేకాకుండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముషారఫ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించకూడదని సర్వేలో వెల్లడించారు. కాగా.. వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాక్ ప్రజలు ఏ పార్టీకి పట్ట కట్టక పోవడం గమనార్హం. మాజీ ప్రధానులు బెనజీర్ భుట్టో నేతృత్వంలోని...


లండన్‌లో మళ్లీ నాట్యం చేస్తా


పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి బిబిసీ రియాలిటి షోలో నాట్యం చేయాలన్న ఆరాటం మొదలయినట్లుంది. బిబిసీ రియాలిటీ షో నిర్వాహకుల భారతదేశానికి సంబంధించిన నాట్యాన్ని చేయమని తనకు ఆహ్వానం వస్తే వదిలిపెట్టనని చెపుతోంది ఈ 32 ఏళ్ల ప్రౌఢ సుందరి.


ఇంతకుముందు లండన్‌లో బిగ్ బ్రదర్ షో నిర్వహించిన షోలో శిల్పాశెట్టి పాల్గొంది. ఆ ప్రదర్శనలో శిల్పాశెట్టిపై కులవివక్షకు సంబంధించిన అంశాలను లేవనెత్తటంతో... దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అయితే చివరికి...


Tuesday, December 4, 2007

మెగాస్టార్ 'చిరు' కొత్తపార్టీ...?


మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి దిగకూడదని పలు రాజకీయాలు చేసిన కొందరిని ఖంగుతినిపించేలా చిరంజీవి పావులు కదుపుతున్నారు. సోమవారం రాత్రి తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు మీడియా అధినేతలను ఆయన కలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబంలో జరిగిన సంఘటనలను వారితో చర్చించినట్లు సమాచారం. శ్రేయోభిలాషులు,మేథావులతో కూడా చర్చించిన మీదట తన రాజకీయ ప్రవేశాన్ని బయటపెట్టినట్లు తెలిసింది.


ఇప్పటివరకూ చిరంజీవి రాజకీయాల్లోకి రారనీ, ఆయనకు వచ్చే ధైర్యం కూడా లేదని చెప్పుకుంటున్న కొంతమందికి ఈ విషయం షాక్ లాంటిది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే...


శ్రీరామదాసులో సీత పాత్ర... బ్యాంక్‌లో సెక్సీ పాత్ర


శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్ర పోషించి ప్రేక్షకుల చేత ఫర్వాలేదనిపించిన నటి అర్చన అలియాస్ వేదను అందరూ అమాయకురాలనుకున్నారు. కాని వాటన్నింటికీ తెర దించుతూ ఇటీవల బ్యాంక్ చిత్రంలో సెక్సీ పాత్ర పోషిస్తు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సారథ్యంలో యువసామ్రాట్ నాగార్జున నటించిన శ్రీరామదాసు చిత్రంలో తనకు ఓ పాత్ర వచ్చే సరికి తెగ ఆఫర్లు వచ్చేస్తాయని భావించింది. అయితే అనుకున్న విధంగా జరుగక అన్నీ తారుమారై పోయేసరికి పాపం చివరికి...


Wednesday, November 28, 2007

కృష్ణభగవాన్, సిమ్రాన్‌ల జాన్ అప్పారావ్ 40+


శ్రీవరసిద్ది వినాయకస్వామి సమర్పణలో రూపొందుతున్న జాన్ అప్పారావ్ 40+ చిత్రం బ్లాక్ అండ్ ఎయిట్ యాక్ట్ పతాకంపై చిత్రీకరిస్తున్నారు. కూచిపూడి వెంకట్ స్వీయ దర్శకత్వ సారథ్యాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వెంకట్ నిర్మిస్తున్నారు. కృష్ణభగవాన్, సిమ్రాన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుపుకుంటోంది.


నవంబర్ వారాంతంలో రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తున్నామని దర్శకనిర్మాత చెప్పారు. బ్యాంకాక్, పట్టాయ్, థాయ్‌లాండ్, పుకెట్ ఐలాండ్‌లలోని అందమైన లొకేషన్‌లలో పాటలు తీస్తున్నామని చెప్పారు. అలాగే మరో పాటను రామోజీ ఫిలిం సిటీలో సెంట్ సాంగ్ తెరకెక్కించడంతో...


ప్రమాణ స్వీకారం చేసిన ముషారఫ్


పాకిస్తాన్ దేశాధ్యక్షుడిగా పర్వేజ్ ముషారఫ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముషారఫ్ దేశాధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీకి ముందు ముషారఫ్ దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చెల్లదని కోరుతూ దాఖలైన పిటీషన్లు అన్నింటిని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ముషారఫ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టయింది.


ఈ సందర్భంగా ముషారఫ్ ప్రసంగిస్తూ.. దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి త్వరలోనే అధికమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా...


Sunday, November 25, 2007

ప్రియతమా... ఇదే నా ఆహ్వానం


-యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు


ఈ చల్లని వెన్నెల

ఈ పచ్చని పైరు

ఈ సెలయేటి గలగలలు

ఈ చిరుగాలి సవ్వడులు


నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్

ఎన్నాళ్లీ ఎడబాటు

ఎన్నాళ్లో ఈ విరహ వేదన

ఎంతకాలం ఈ ఎదురుచూపు...


"కృష్ణార్జున"లుగా యువసామ్రాట్, విష్ణు


పి.వాసు దర్శకత్వంలో నాగార్జున, విష్ణు నటిస్తున్న చిత్రానికి "కృష్ణార్జున" అనే టైటిల్‌ను ఖరారు చేసారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ప్రేక్షకులే ఎంపిక చేసినట్టు దర్శకుడు వాసు వెల్లడించారు. దీనిపై చిత్ర హీరోలలో ఒకరైన విష్ణు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి "మిత్రమా" అనే టైటిల్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నాం. అయితే.. ఎక్కువ మంది ప్రేక్షకులు "కృష్ణార్జున" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సరైన కథ లభించినట్టయితే.. "మిత్రమా" అనే టైటిల్‌తో చిత్రాన్ని చేస్తామన్నారు.


ఈ చిత్రంలో నటించేందుకు అడిగిన వెంటనే నాగార్జున గారు అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫాంటసీ చిత్రం. ఇందులో నేను సూపర్ హీరోగా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి...


Friday, November 23, 2007

అందానికి మించిన అందం 'సెక్సీనెస్'


ఆసియాలో అత్యంత సెక్సీ ఉండే మహిళల జాబితాను ఓ పత్రిక ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధమస్థానాన్ని బాలీవుడ్ సెక్సీక్వీన్ బిపాసాబసు కైవసం చేసుకుంది. అంతకు ముందు 2005లోనూ బిపాసా తొలిస్థానంలో ఉండటం విశేషం. కాగా తాజాగా ప్రకటించిన జాబితాలో టాప్ టెన్ సెక్సీ బ్యూటీల జాబితా ఇలా ఉంది.


అగ్రస్థానంలో బిపాసాబసు, ద్వితీయ స్థానంలో మాధురీ దీక్షిత్.. ఆ తర్వాత వరుసగా ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్, లైలా రౌవోస్, శిల్పా షెట్టి, కత్రినా కైఫ్, కరీనాకపూర్...


Wednesday, November 14, 2007

అసిన్ బాలీవుడ్ అనుభూతి


గజిని, తమిళ 'పోకిరి' చిత్రాలతో ఉన్న ఫళంగా తన పారితోషికాన్ని, ఇమేజ్‌ని పెంచుకున్న సెక్సీతార అసిన్. ఈ పూబంతి ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో మహా బిజీగా ఉంది.


అంతేకాదండోయ్... అక్కడ ఓ ఇల్లును కూడా కొనేసింది. ఇక దాదాపు అక్కడే సెటిలైనట్లే కదా... అని అడిగితే, "కాదు కాదు, నేను దక్షిణాది అమ్మాయిని. నా ప్రిఫరెన్స్ దక్షిణాదికే. ఇల్లు కొన్నంతమాత్రాన...


ఘనమైన బాలల దినోత్సవం



పిల్లలూ దేవుడూ చల్లనివారే... కల్మషం లేని ఆ పసివారికోసం మన దేశంలో ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించబడుతోంది. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం కూడా అయిన ఈరోజున బాలల దినోత్సవాన్ని నిర్వహించటం.. బాలల పట్ల ఆయనకు గల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలే కారణం.


ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు.అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని...


Monday, November 12, 2007

అందరి దైవం నీవన్నా...


కార్తీకమాసంలో నాగులచవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. నాగుల చవితినాడు ఉపవాసం ఉండి పుట్టదగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పంచమినాడు బంగారంతోగానీ, వెండితోగానీ, కర్రతోగానీ, మట్టితోగానీ 5 పడగల పాములను చేయించుకునిగానీ, లేకుంటే పసుపు చందనాలతో సర్పముల చిత్రాలను గీచి, భక్తితో పూజించి పాలు, పాయసము నువ్వుల పిండి....


ఏడేళ్ళ బాలికకు జాతీయపురస్కారం


1330 సూక్తులను కలిగిన తిరుకురల్‌ను ఏడు సంవత్సరాల వయసు గల లావినశ్రీ ఏకధాటిగా ఆలపిస్తుంది. తన ప్రతిభాపాటవాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకోనున్న లావినశ్రీని జాతీయ ప్రతిభా పురస్కారం వరించింది.


2006 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిభను కనపరిచే బాలలను జాతీయ పురస్కారాలకు ఎంపిక చేసే కమిటీ ఎమ్. లావినశ్రీని ఎంపిక చేసింది. నగరంలోని పాఠశాలలో లావినశ్రీ మూడవ తరగతి చదువుతున్నదని ఆమె తండ్రి కె.మునిసామీ తెలిపారు. మూడు సంవత్సరాల వయస్సులోనే తిరుకురుల్ పట్ల మక్కువను...


Sunday, November 11, 2007

దీపావళి హాస్యానందం


మనసారా నవ్వుకోవటం రానురాను తగ్గిపోతోందని పరిశోధకులు వాపోతున్నారు. హృదయాన్ని తేలికపరిచే హాస్యాన్ని ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందనీ, ఫలితంగా అనేకానేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారంటున్నారు.


ఇటీవల చాలా చోట్ల లాఫింగ్ సెంటర్ల ప్రాధాన్యం పెరగటానికి కారణం ఈ నవ్వుకున్న ప్రాధాన్యం తగ్గిపోవటమే. ఈ నేపథ్యంలో సన్నివేశానుసారంగా మనసుకు...


లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల


ఆంజనేయ స్వామి భక్తులకు నయనానందం కలిగిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా విన్నూత్నమైన ప్రదర్శనశాల లక్నోలో ఏర్పాటైంది. ఆంజనేయ స్వామికి చెందిన అరుదైన వస్తువులతో నిండిన ఈ ప్రదర్శనశాల 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌'లో స్థానం సంపాదించుకుంది. ఈ బృహత్కార్యం సాకారం వెనుక హనుమత్ భక్తుడైన సునీల్ గొంబార్ కృషి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆంజనేయస్వామికి అనేక వస్తువులను సునీల్ సేకరించారు.


లక్నోలోని ఇందిరానగర్‌లో గల తన నివాసమైన 'బజ్‌రంగ్ నికుంజ్' మొదటి అంతస్తులో తను సేకరించిన వస్తువులను సునీల్ ప్రదర్శనకు ఉంచారు. శ్రీరామచంద్రుని 48 గుర్తులను కలిగిన 'చరణ్ పాదుక'(అడుగు జాడలు)ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా వెండితో అలంకరించబడి ఉన్నాయి. శ్రీరాముడు స్మరించిన హనుమంతుని సహస్ర నామాలను (వెయ్యి పేర్లు) కూడా మీరు...


Tuesday, November 6, 2007

దీపావళి పండుగ ఎలా వచ్చింది


పిల్లలూ! దీపావళి పండుగ అంటే మీకు చాలా ఇష్టం కదూ! దీపావళి వచ్చిందంటే మీ కళ్ళలో వెలిగే సంతోషం ముందు కోటి మతాబుల వెలుగు కూడా దిగదుడుపే. స్కూల్ లేకపోయినా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపడం కొంచెం కష్టమే అయినా అలమరలో దాచుకున్న టపాసులు గుర్తుకు రాగానే నిద్రమత్తు ఇట్టే వదిలిపోతుంది.


తల స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కొత్త బట్టలు తొడుక్కుని, నాన్న కొని తెచ్చిన టపాసులను తీసుకుని మేడ మీదకు వెళ్ళి వాటిని కాలుస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరి మిమ్మల్ని ఇంత ఆనందపెడుతున్న దీపావళి ఎలా వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాందీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు...


అష్టైశ్వర్యాలను తెచ్చే దివ్య దీపావళి


జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళినాడు తెల్లవారు ఝామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు నిర్వహించాలి. మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానమాచరించాలి. ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి.


ప్రధానంగా ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు... ఐదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. దీపావళినాడు పగలు ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి భోజనం చేయాలి. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి, పితృదేవతలకు దారి చూపించాలి. ఆ తర్వాత....


Saturday, October 27, 2007

అర్థం చేసుకోండి.. అందరం కలసిపోదాం: శ్రీజ


తన కుటుంబ సభ్యులు తమ ప్రేమను అర్థం చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ మరోసారి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసింది. ఇరువురు కుటుంబ సభ్యులు ఒక అవగాహనకు వస్తే.. రెండు కుటుంబాలు కలసి పోవచ్చని ఆమె సూచించింది. ఢిల్లీలో ఉంటున్న శ్రీజ దంపతులు శుక్రవారం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం.


తన తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాం అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే.. మనస్పూర్తిగా క్షమించమని అడుగుతున్నాం. అయితే.. అత్తమామయ్య వాళ్లు మాత్రం త్వరగా ఇంటికి రమ్మంటున్నారు. మా కుటుంబం తరపు నుంచే...


మరువలేను సారీ....


యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు

జాజిపువ్వు మనసులాంటి బంగారీ

జంటగా ఉండాలి ప్రతిక్షణం యిహ మరీ

బంతిపువ్వులాంటి ఓ నా బంగారీ

బరువు నిండిన బాధ ఎప్పటిదాకో మరీ


స్వర్ణకమలం లాంటి నా బంగారీ

స్వంతమవుతావుగా నాకు తెలుసు మరీ

ప్రతి సూర్యకిరణంలో నిండిన ఓ నా బంగారీ

ప్రతిరోజూ ప్రత్యక్షమవుతాయి నా ముందుమరీ

కలువరాజు పంచే కమ్మని వెన్నెల లాంటి బంగారీ



Friday, October 26, 2007

దూకుడు కొనసాగిస్తాం: రాంచీ రాకెట్


భవిష్యత్‌లో కూడా భారత్ జట్టు దూకుడును కొనసాగిస్తుందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. జార్ఖండ్ ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో రాంచీ రాకెట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచేందుకు తాము దూకుడును కొనసాగిస్తాయమని స్పష్టం చేశాడు.


భారత్ సాధించిన విజయాలు జట్టు సభ్యుల సమిష్టి కృషి ఫలితం అని ధోని అన్నాడు. కార్యక్రమంలో ధోనికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించిన ఆశ్చర్యకర బహుమతి...టయోటా కరోలా లగ్జరీకారు, రూ. ఐదు లక్షల చెక్‌ను జార్ఖండ్ ముఖ్యంత్రి మధు కొడా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...


Wednesday, October 24, 2007

మా ప్రేమ కథకు నాన్నే నిర్మాతగా ఉండాలి: శ్రీజ


మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌ల వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అయితే.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో మాత్రం.. శ్రీజ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.


తాజాగా.. తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్‌ చిత్రరంగంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంటోంది. ఒకవేళ తమ ప్రేమ కథ తెరకెక్కితే.. ఆ చిత్రానికి తన తనండ్రి మెగాస్టారే నిర్మాతగా ఉండాలని శ్రీజ భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. ఈ చిత్రంలో తన భర్త శిరీష్‌తో కలసి నటించేందుకు సిద్ధంగా...


జెస్సీ మెట్‌కాఫ్‌ సరసన శివాజీ భామ


తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన అందాల హీరోయిన్ శ్రియ నటించింది ఒక్క చిత్రమే కావచ్చు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న శ్రియ బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం కూడా సాఫీగా సాగింది.


అలాగే.. హాలీవుడ్ నటుడు జెస్సీ మెట్‌కాఫ్ సరసన నటించే సువర్ణావకాశం తాజాగా కొట్టేసింది. అశోక్ అమృతరాజ్ సొంత నిర్మాణ సంస్థ అయిన హైడ్ పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జెస్సీ మెట్‌కాఫ్ హీరోగా నిర్మించనున్న...


Tuesday, October 23, 2007

"మిస్సమ్మ"కు పెళ్ళయిపోయింది!


ప్రముఖ సినీనటి భూమిక ముంబయికి చెందిన యోగా మాస్టర్ భరత్ ఠాగూర్‌ను విజయదశమి నాడు వివాహం చేసుకుంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ సరసన "యువకుడు" చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా భూమిక తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అనంతరం తమిళ, హిందీ సినిమాల్లో నటించడం ద్వారా తనదైన ప్రతిభను భూమిక చాటుకుంది.


ఈ నేపథ్యంలో ఆమె చిరకాల మిత్రుడు, యోగామాస్టర్ భరత్ ఠాగూర్‌, భూమికల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందంటూ...వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సమర్థిస్తూ త్వరలో తామిరువురూ పెళ్ళి చేసుకోబోతున్నామంటూ భూమిక చెపుతూ వచ్చింది. ఆ పెళ్ళిపై ఊహాగానాలను తెరదించుతూ నాసిక్‌లో అత్యంత సన్నిహితులు, స్నేహితుల...


నాడీ జ్యోతిష్యం : తాళపత్రాలలో భవిష్యత్


మన దేశంలో జ్యోతిష్యం వటవృక్షం నీడలో హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం, నక్షత్ర భవిష్యవాణి ఇలా అనేక రకాల పద్ధతులు వేళ్ళూనుకుని ఉన్నాయి. ఈ పద్దతులలో శతాబ్దాల కాలంగా అత్యంత ప్రాచుర్యం పొందినదిగా నాడీ జ్యోతిష్యం పేర్కొనబడింది. ఏదినిజం శీర్షికలో భాగంగా, ఈ వారం ఆశ్చర్యానికి గురి చేసే జ్యోతిష్యాన్ని మీకు పరిచయం చేసేందుకు తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన వైదీశ్వరన్ దేవాలయానికి తీసుకు వెళ్తున్నాం.


వైదీశ్వరన్ దేవాలయానికి చుట్టుపక్కల మీ భవిష్యత్తును, మీ తలరాతను తెలియజెప్పే నాడీజ్యోతిష్యానికి చెందిన పలు ప్రకటన బోర్డులు మీకు అడుగడుగునా కనిపిస్తూ మీకు స్వాగతం చెపుతుంటాయి. వలం తమిళనాడు నుంచేకాక దేశంలోని పలు ప్రాంతాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చే ప్రజలు వైదీశ్వరుని దర్శనం...


Monday, October 22, 2007

సంజయ్‌దత్‌కు తీర్పు కాపీ


బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ సోమవారం టాటా కోర్టు నుంచి 4,000 పేజీల తీర్పు కాపీని అందుకున్నారు. తీర్పు కాపీని అందుకున్న సంజయ్‌దత్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేసారు. అనంతరం సంజయ్‌దత్‌ను పోలీసులు ఆర్ధర్‌ రోడ్డు జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా టాడా కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు ఉపకరించే న్యాయపరమైన అంశాలను సంజయ్‌దత్ న్యాయవాదులు పరిశీలిస్తున్నారు.


ఆయుధాల చట్టం కింద టాడా కోర్టు సంజయ్‌దత్‌ను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజయ్‌దత్‌తో పాటు ఆయన సహచరులు కేర్సీ అడ్జానియా, యూసఫ్ నల్వల్లా...


శ్రీజ దంపతులకు పోలీసు రక్షణ: ఢిల్లీ హైకోర్టు


శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులకు రక్షణ కల్పించవలసిందిగా ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా వారిరువురికి ఎటువంటి హాని తలపెట్టబోమంటూ చిరంజీవి కుటుంబసభ్యులు హామీ పత్రాన్ని అందించాలని కోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ, శిరీష్‌లు ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో తమకు ప్రాణాపాయం కలుగుతుందని, తమకు రక్షణ కల్పించాలంటూ...


Friday, October 19, 2007

ఓం శ్రీ దుర్గాదేవతాయైనమః


నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. `దుఃఖేన గంతుం శక్యతే ఇతిదుర్గా` అని అన్నారు. అంటే, దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి.


అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథిరోజున రురుకుమారుడైన దుర్గముడైన రాక్షసుడిని సంహరించింది. దుర్గాదేవి ఆది ప్రకృతి. పంచమహా స్వరూపాల్లో మొదటిది. ఈ తల్లి శక్తి అనంతం. అందుకే వివిధ రకాల దుర్గాదేవి...


కరీనాతో ఆఫైర్స్ నిజమే: సైఫ్ ఆలీఖాన్


తనకు బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ మధ్య సంబంధం ఉన్న మాట నిజమేనని బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ స్పష్టం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గురువారం రాత్రి ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌ ముగింపు కార్యక్రమంలో సైఫ్ దీనిపై నోరు విప్పారు.


ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా...


Tuesday, October 16, 2007

రంగులు మార్చే శివలింగం...


రామసేతువుకు తలెత్తిన ముప్పుతో శివలింగం రంగు మార్చుకుంటున్నదా? నమ్మండి నమ్మకపోండి, వారణాసిలోని శివలింగాలకు తోడుగా లక్నో నగరంలోని శివలింగాలు కూడా తమ రంగులను మార్చుకుంటున్నాయి. ఒకేరోజులో శివలింగాలు తమ రంగును మార్చుకున్న వైనం, కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు భారతంలో విఘ్నేశ్వరుని విగ్రహాలు పాలు తాగిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది.

లక్నోలోని ఛారోధామ్ దేవాలయంలో శివలింగం రంగు మార్చుకున్న సంగతి తెలియగానే, దేవాలయానికి చేరుకున్న అనేక మంది భక్తులు శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లరంగులోని శివలింగం తెల్లరంగులోకి మారడంతో ఈ సంఘటన బహుళ ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ...


Monday, October 15, 2007

భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'


అంబాజీ- గుజరాత్‌లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతూ 'అంబా భవానీ'గా పిలవబడుతున్న దివ్య క్షేత్రం. అతి పురాతనమైన ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఎటువంటి దేవతామూర్తి కనిపించదు. దేవతామూర్తి పీఠం అక్కడ ఉంది. వస్త్రాలు మరియు ఆభరణాలు అలంకరించిన తీరు అక్కడ దేవతామూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. 'జయ అంబే' అంటూ భక్తులు సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ఉంటుంది.


ఈ అమ్మవారి కరుణాకటాక్షవీక్షణలతోనే రుక్మిణి, శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తలనీలాలు సమర్పించుకున్నాడని భక్తుల విశ్వాసం. అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు 'లోక్ మేలా' పేరిట ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అంబాజీ మాతను భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు. విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత...


మరో చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ముమైత్


'పోకిరి' చిత్రం ద్వారా ఐటంగర్ల్‌‌గా తెలుగు చిత్ర రంగం ప్రవేశం చేసిన ముమైత్ ఖాన్.. చిన్నగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అనే పాటతో యువతను ఉర్రూతలూగించిన ముమైత్.. ఆ తర్వాత 'ఆపరేషన్ దుర్యోధన', 'ఎవడైతే నాకేంటి' చిత్రాల్లో నటించింది.


ఈ చిత్రాల్లో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆమె హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. త్వరలో విడుదల కానున్న 'మైసమ్మ ఐపీఎస్' చిత్రంలో ముమైత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకమునుపే...


Thursday, October 11, 2007

ఆన్‌లైన్ ద్వారా మీనాక్షి అమ్మవారి దీవెనలు


ప్రపంచంలో ఎక్కడ నుంచైనా మధుర మీనాక్షి అమ్మవారి దీవెనలను అందుకునే సౌకర్యాన్ని మీనాక్షి దేవస్థానం కల్పించింది. ఇంట్లోనుంచే ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించే అవకాశాన్ని ఇటీవల దేవస్థానం కల్పించింది.


భక్తులు రూ. 500 నుంచి రూ.2250 చెల్లించి పూజ లేదా అభిషేకాన్ని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. అయితే తొలిగా ఈ సౌకర్యాన్ని అందించిన ఘనత తిరుమల తిరుపతి దేవస్థానదే. మధుర మీనాక్షి అమ్మవారికి పూజలను ఆన్‌లైన్ ద్వారా అందజేసే సౌకర్యాన్ని...


తొలిషెడ్యూల్‌ పూర్తయిన "నితిన్" సినిమా


నితిన్, మమతా మోహన్‌దాస్, సింధుతులాని, శశాంక్ ప్రధాన తారాగణంగా, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న నితిన్ చిత్రం తొలి షెడ్యూల్ గురువారంతో పూర్తవుతుంది. ఈ విషయాన్ని నానక్‌రామ్ గూడాలోని సిలీవిలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నానాక్‌రామ్ గూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ నెల 3 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభమయిందని చెప్పారు. నితిన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు. "సామాన్యుడు" చిత్రం తర్వాత దర్శకుడు చాలా కసితో చేస్తున్న ఈ చిత్రం అందరికీ పేరు తెస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రవి. సి. కుమార్ విలేకరులతో మాట్లాడుతూ... కథానుగుణంగా బడ్జెట్‌కు పరిమితం లేకుండా, వర్కింగ్ డేస్ నిబంధనలు లేకుండా నిర్మాత చక్కని సహకారం అందించారని చెప్పారు. ప్రేమ, యాక్షన్...


Wednesday, October 10, 2007

ఏప్రిల్ నుంచి రూ. 2 బియ్యం: వైఎస్


వచ్చే సంవత్సరం జనవరి లేదా ఏప్రిల్ మాసం నుంచి రెండు రూపాయలకే కిలో బియ్యం పధకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారందరికీ పై పధకాన్ని వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాల ప్రారంభం నిమిత్తం చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం వైఎస్ పర్యటించారు. మరో రెండేళ్ళలో రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ...


మీ ఫ్యాషన్ శైలిని మెరుగుపరుచుకోండి


ఫ్యాషన్‌గా కనిపించాలంటే కేవలం ఫ్యాషన్ వస్త్రాలు ధరిస్తే సరిపోదు. వస్త్రాలతో పాటు మీరు కూడా ఫ్యాషన్‌గా కనపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పట్టణాలలోను, నగరాలలలోనూ నివసించే మహిళలు ఫ్యాషన్‌గా కనిపించడానికి కొన్ని చిట్కాలను పాటించవలసి ఉంటుంది. పదుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపేందుకు ఊతమిచ్చే ఫ్యాషన్ చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము.


మీరు లావుగా ఉన్నట్లయితే, స్లీవ్‌లెస్ కట్‌లకు గుడ్‌బై చెప్పండి. తేలికపాటి షేడ్స్‌ను వదిలి గాఢమైన రంగులతో కూడిన వస్త్రాలను అలా కాకుండా తేలికపాటి షేడ్స్‌ను మాత్రమే ధరించాలని మీరు కోరుకున్నట్లయితే...


తరుణ్ సరసన 'పోకిరి' భామ


తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు వెల్లువలా వస్తున్న హీరోయిన్లలో ఇలియానా ఒకరు. అయితే.. వచ్చిన అవకాశాలను అంగీకరించేందుకు ఆమె ససేమిరా అనండంతో తెలుగుకు స్వస్తి పలికినట్టేనని కొందరు భావించారు. దీంతో ఇలియానా కల్పించుకుని, తనకు ఓ ఇమేజ్‌ను, గుర్తింపును ఇచ్చిన తెలుగు పరిశ్రమను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో యువహీరో తరుణ్‌తో ఓ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ప్రధాన పాత్రను...


అమెరికాలో "గానగంధర్వుని"కి సత్కారం


కర్నాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను అమెరికా కాంగ్రెస్ సత్కరించింది. శాస్త్రీయ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఒక ప్రశంసాపూర్వక పత్రాన్ని అమెరికా కాంగ్రెస్ విడుదల చేసింది.


ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి నిక్ ల్యాంప్సన్ టెక్సాస్‌లో మీడియాతో మాట్లాడుతూ...బాలమురళీకృష్ణను భారతీయ సంగీతానికి చెందిన "లెజెండ్‌"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా లాంగ్ ఐలాండ్ సమీపంలో శ్రీవారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ...


Tuesday, October 9, 2007

ఆయన తమిళ కోహినూర్ వజ్రం: నమిత


'శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విక్రమ్. నటనలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తమిళ చిత్ర రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ తెలుగులో నటిస్తున్న చిత్రం 'మల్లన్న' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా.. ఆరు అడుగుల అందంతో తమిళ చిత్ర సీమలో సెక్సీతారగా గుర్తింపు పొందిన నటి నమిత.


ఆమె ఇటీవల తమిళ హీరోలపై తన మనస్సులోని మాటలను చెప్పింది. సియాన్ విక్రమ్ తమిళ చిత్ర రంగానికి దొరికిన కోహినూర్ వజ్రమని నమిత వ్యాఖ్యానించింది. చిత్రమేమంటే నమిత ఇంకా విక్రమ్‌తో ఒక్క సినిమా కూడా చేయక పోవడం విశేషం. అయినా విక్రమ్ అంటే నమితకు విపరీతమైన...


Monday, October 8, 2007

సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా


అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గా భారత దేశంలోని అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ముస్లీం పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్నది. సర్వమతాల ప్రజల భక్తివిశ్వాసాలను ఈ దర్గా చూరగొంటున్నది. ముస్లీం మతాచార్యుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ సమాధి చెందిన స్థలమే అజ్మీర్ షరీఫ్ దర్గాగా రూపాంతరం చెందింది.


భారత్ మరియు పాకిస్థాన్ దేశాలలోని అత్యంత ప్రముఖమైన సూఫీ సంఘాలకు చెందిన చిస్టీ సూఫీ పరంపరను హజ్రత్ మొయినుద్దీన్ చిస్టీ వ్యవస్థాపించారు. తమ ధార్మిక చింతన, ఆకర్షణ శక్తి, దీవెనలు మరియు సేవల ద్వారా సూఫీ బోధకులు ఇస్లాం మతవ్యాప్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 1190 సంవత్సరం నుంచి...


మల్లెనవ్వుల అలివేణి


వెన్నెల అందాల విరబోణి

కలువరేకుల కమనీయవాణి

చేమంతుల సిరివేణి

మల్లె నవ్వుల అలివేణి


నీ స్నేహం

నాకు ఉత్తేజం

నీ ప్రోత్సాహం

నా విజయం...


Friday, October 5, 2007

ఆ నవ్వులు కోసమే...


యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు


ప్రపంచంలో నవ్వగలిగే ఏకైక జీవి మనిషి. సృష్టిలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం మనిషికి మాత్రమే నవ్వగలిగే శక్తిని ప్రసాదించింది ప్రకృతి. నవ్వు మనిషికి ఎంతో మంచి చేస్తుంది. నవ్వినప్పుడు ముఖ కండరాలన్నీ కదులుతాయి. అంతేకాదు... ఛాతీ ఉదర, కండరాలకు వ్యాయామం చేకూరుతుంది. ఇంతటి విలువైన నవ్వుకు మనిషి ఎందుకో దూరమవుతున్నాడు. రోజుకు కనీసం 18 నిమిషాలపాటు మనిషి నవ్వేవాడు. అయితే ఇది ప్రస్తుత పరిస్థితి కాదు. 1950ల కు ముందుమాట. మరి నేటి పరిస్థితి ఏమిటీ... అంటే....


కేవలం ఆరంటే ఆరు నిమిషాలకు మించి మనిషి నవ్వటం లేదని పలు పరిశోధనలు చెపుతున్నాయి. పెద్దల్లో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ ప్రభావం పిల్లలపైనా పడుతోందని వారు చెపుతున్నారు. ఇదివరకు పిల్లలు రోజులో కనీసం నాలుగు వందల సార్లు నవ్వేవారు. ఇప్పుడా అందాల నవ్వులు...


Thursday, October 4, 2007

ప్రియమణికి ఇక తిరుగులేదు


ఇది గ్లామర్ పరిశ్రమ... గ్లామర్‌గా కనిపించంలో ఎటువంటి తప్పులేదంటోంది టాలీవుడ్‌లో వరస ఆఫర్లు దోచేసుకుంటున్న ప్రియమణి. కథాపరంగా చేసే ఎక్స్‌పోజింగ్‌కు స్వాగతం పలుకుతానంటోంది.


ఆ మధ్య తన మీద వచ్చిన పుకార్ల గురించి మాట్లాడుతూ.... సినీ పరిశ్రమ నలుగురితో ముడిపడినది. ఇటువంటి పరిశ్రమలో ఉన్నప్పుడు తోటి వాళ్లతో...


మానసిక ఆరోగ్యానికి మేలైన చిట్కాలు


పోటీప్రపంచంలో మెరుగైన జీవన ప్రమాణాన్ని అందుకోవడం కోసం సాగించే జీవనపోరాటంలో నలుగురు మాత్రమే సభ్యులుగా గల కుటుంబాలు సైతం ఒకరితో ఒకరి కలిసిమెలిసి మాట్లాడుకునేందుకు వీలు కల్పించని విధంగా ప్రతిఒక్కరు తమ వృత్తి వ్యాపకాలలో నిమగ్నమైపోతున్న వైనం చర్వితచరణమే. ఈ నేపథ్యంలో మనిషి ముందుకు సాగడానికి ఎంతగానో ఉపకరించే మానసిక ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము.


1. ఆత్మవిశ్వాసాన్నిపెంచుకోండిమీలోని బలాన్ని, బలహీనతలను గుర్తించండి. గుర్తించిన వాటిని రాగద్వేషాలకు పోకుండా బేరీజు వేసి లోపాలను సరిచేసుకుంటూనే...


Wednesday, October 3, 2007

ఆగ్రహంతో ఊగిపోతున్న సెక్సీతార


తమిళ, తెలుగు చిత్ర సీమల్లో సెక్సీతారగా ముద్ర వేసుకున్న హీరోయిన్ నమిత. ఈమెపై తాజాగా నీలి చిత్రాల స్పెషలిస్టు, పెళ్లిళ్ళ పేరయ్యగా ముద్రడిన లియాకత్ ఆలీ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క నమితపైనే కాకుండా.. నగ్మా, మీనాలతో కూడా దగ్గరి సంబంధాలు ఉన్నట్టు ప్రకటించాడు. ఈ వార్తలు విన్న నమిత మాత్రం వెంటనే స్పందించి.. లియాకత్ అలీ చెప్పిందాంట్లో ఎంత మాత్రం నిజంలేదని వాదిస్తోంది.


కింగ్ ఆఫ్ మ్యారేజ్‌గా పేరు గడించిన లియాకత్ అలీ వెల్లడించిన వార్తలు తమిళ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. నగ్మా, మీనా, నమితలతో తనకు దగ్గరి స్నేహం ఉందని, ఈ ముగ్గురిలో నమిత మరింత దగ్గరి స్నేహితురాలని...


Friday, September 28, 2007

సెక్సీ చూపుల అనుష్క బిజీబిజీ


'విక్రమార్కుడు'తో తెలుగు ప్రేక్షకలోకంలో మార్కులు కొట్టేసిన గ్లామర్ హీరోయిన్ అనుష్క టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా పలు చిత్రాలకు అనుష్క తన అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ న్యూస్. సురేష్ ప్రొడక్షన్స్ రవితేజతో ఓ చిత్రం నిర్మించనున్నదని, అందులో అనుష్క కథానాయికగా నటించనుందని టాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి.


అదేవిధంగా మరో అగ్రదర్శకుడు దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అనుష్క...


Monday, September 24, 2007

ట్వంటీ-20 ప్రపంచ కప్: భారత్ ఘన విజయం


దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను "టీమ్ ఇండియా" కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమెట్ ధోనీ నేతృత్వంలోని 'యువసేన'దే పై చేయిగా నిలిచింది. లీగ్ మ్యాచ్‌లో బౌలౌట్ పద్దతిలో పాక్‌ను ఓడించిన భారత జట్టు సోమవారం జరిగిన మ్యాచ్‌లోను ఐదు పరుగులు తేడాతో గెలిచి ట్వంటీ-20 ప్రపంచ తొలి ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇర్ఫాన్ పఠాన్ సొంతం చేసుకున్నాడు.


అంతర్జాతీయ ఫైనల్ మ్యాచ్‌లో దాయాదులుగా పేరుగాంచిన పాకిస్తాన్-భారత్‌ జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై ఉన్న జోహెన్స్‌బర్గ్‌లోని వాండర్సన్ స్టేడియంలో తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. భారత జట్టులో గౌతం గంభీర్ (75), రోహిత్ శర్మ (30)లు మాత్రమే రాణించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లలో వీరబాదుడు బాదిన యువరాజ్ సింగ్...


Thursday, September 20, 2007

మాడవీధులలో మారుతిపై ఊరేగిన శ్రీవారు


జగదాభిరాముడు కౌసల్య తనయుడు ఆజానుబాహువు, అరవింద దళాక్షుడైన ముగ్దమనోహర నీలవర్ణ శోభితుడు, అయోధ్య రాముని నామస్మరణయే శ్వాసగా భావించి భక్తులకు ఆదర్శనీయుడుగా నిలిచిన ఆంజనేయుని వాహనంగా చేసుకుని తిరుమలలోని మాడవీధులలో గురువారం ఉదయం రెండుగంటల పాటు శ్రీవారు సాగించిన సంచారం తిరుమలేశుని భక్తులకు అత్యంత రమణీయంగా నిలిచిపోయింది.


దేవాది దేవులు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుషులు వెంటరాగా ఆంజనేయుడు గంతులు వేస్తూ తీసుకు వెళుతున్నాడా... అన్న రీతిలో నీటి అలలపై తేలుతున్న పడవవోలె సాగుతున్న తిరుమలేశుని ఊరేగింపును వీక్షించేందుకు భక్తులు బారికేడ్ల ఆవల నిలుచుండి తదేక దీక్షతో...


భారత్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్


భారత సంతతికి చెందిన అమెరికా అంతరీక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ గురువారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. అత్యధిక కాలం అంతరీక్షంలో గడిపిన మహిళగా ఈ సంవత్సరం సరికొత్త రికార్డును నెలకొల్పిన సునీత తన వారం రోజుల భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్నారు.


దశాబ్ద కాలం అనంతరం అహ్మదాబాద్‌లోని బంధువులను సునీత కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యాసంస్థలు నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు. చారిత్రాత్మకమైన సబర్మతీ ఆశ్రమంలో...