Tuesday, December 18, 2007

నా కళ్లే నా ప్లస్ పాయింట్స్


చారిడేసి కళ్లు... ముత్యాల్లాంటి పలువరుస... ఆకర్షణీయమైన శరీరాకృతి.... బాలీవుడ్ క్వీన్ దీపిక సొంతం. దీపిక అంటే ఎవరో.... అని అడిగేవారు బహుశా ఉండకపోవచ్చు. 'ఓం శాంతి ఓం' చిత్రం ద్వారా భారతీయ వెండితెరకు పరిచయమైన ఈ సెక్సీ రాణి తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలున్నాయని అంటోంది.


అచ్చమైన భారతీయ మహిళ ధరించే దుస్తులంటే పడుకునెకు అత్యంత ప్రీతిపాత్రం. పాశ్చాత్య మోడళ్లను అంతగా ఇష్టపడనని చెప్పినప్పటికీ జీన్స్, టీషర్టులు వేసుకోక తప్పటం లేదని బాధపడుతోంది. మరోవైపు చిత్రంలో పాత్రకు తగ్గట్లు దుస్తులను ధరించి తీరాల్సిందే కదా...


మంచులోకంలో విరిసిన మరుమల్లె


యిమ్మడిశెట్టి వెంకటేశ్వర్రావు


కుర్రాళ్లతో కాలేజీ నందనవనంగా ఉంది. ఆకాశాన్నంటే వృక్షాల నీడన బోయ్స్ అండ్ గాళ్స్ ఊసులాడుకుంటున్నారు. మరోవైపు తమకే తెలిసిన తీయని నవ్వులను కాలేజీ ప్రాంగణంలో విరబూయిస్తున్నారు అమ్మాయిలు. ఆ అందమైన నవ్వులు వెన్నెల తెచ్చిన వసంతంలా ఉంది. ఆరడగుల అందగాడుగా పేరుతెచ్చుకున్న నరేంద్రకు మాత్రం కోపం నషాలనికంటుతోంది. ఎందుకంటే అతనికి ఆడాళ్లంటే ద్వేషం. ఎందుకో... అని ఎవరైనా అడిగితే... రెండు ముక్కల్లో మాత్రం చెప్పడు. పరిచయంతో మొదలై దానికి మహాకావ్యం రూపు తెచ్చే ప్రయత్నం చేస్తాడు.


అందుకే అతనివద్ద అమ్మాయిల గొడవను ఎవరూ ఎత్తరు. ఆడాళ్లంటే తనకు ఉన్న అయిష్టతను ఎవరూ అడగకుండానే అందరి వద్ద ప్రకటించటం అతని దినచర్యలో ఓ భాగమైపోయింది. ఈ విషయం ఆ నోటా... ఆ నోటా అదే కళాశాలలో చదువుతున్న మల్లికను చేరింది. సృష్టికి మూలం స్త్రీయే అని అతనికి తెలియజెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది మల్లిక. ఈ మల్లిక ఓ చూపు విసిరితే... చాలు...