Tuesday, December 30, 2008

శతాబ్ది న్యూస్ పోల్‌లో ఒబామాకే అగ్రస్థానం



అమెరికా కాబోయే అధ్యక్షుడు ఒబామా బరాక్ ఈ శతాబ్ది వార్తల్లో ప్రథముడిగా ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంలో ఒబామా సాగించిన ప్రస్థానానికి ప్రపంచం మొత్తం మీద అద్వితీయమైన కవరేజ్ వచ్చిందని ప్రపంచ వ్యాప్త మీడియా సర్వేలో తెలిసింది. శతాబ్ది మొత్తంలో ఇంత విస్తృత కవరేజీని మరే వ్యక్తి కాని సంఘటన కాని పొందలేదని ఈ సర్వే చాటి చెప్పింది.


ప్రపంచంలోని మరే ఇతర సంఘటనతో అయినా పోల్చి చూస్తే ఒబామా ఎన్నికల ప్రచారానికి రెండు రెట్లు అధికంగా కవరేజ్ వచ్చిందని సర్వే చెప్పింది. ఒబామాకు దక్కిన ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో ఉందని ఈ సర్వేని నిర్వహించిన గ్రోబల్ లాంగ్వేజ్ మోనిటర్ అధ్యక్షుడు పాల్ పేయాక్ చెప్పారు. ప్రపంచాన్ని ఒబామా తన చెంత కట్టిపడేసుకున్నారని పాల్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ బ్లాగులలో అత్యధిక ప్రచారం ఎవరు పొందారనే అంశంపై ఈ సర్వే పరిశోధించింది.


మరిన్ని వవరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల నామ సంవత్సరం... '2008'



సంవత్సరం-2008. ఈ యేడాదికి దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికార మార్పిడికి కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే ఈ యేడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈశాన్య భారతం మొదలుకొని.. ఉత్తర, దక్షిణాదిల్లోని కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.


ఇలాంటి వాటిలో కీలకమైనవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు. రెండు మూడు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి జరిగింది. రాజస్థాన్‌ రాష్ట్రంలో భాజపా.. కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి...


మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి