Saturday, September 15, 2007

శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలు


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సందర్శించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము ప్రకటించిన బ్రహ్మోత్సవ వివరాలను ఈ దిగువ ఇస్తున్నాము. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించండి. 14-9-07 అంకురార్పణము/ శ్రీసేనాధిపతి ఉత్సవము... రాత్రి 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు 14-9-07 సర్వ దర్శనము... ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు 14-9-07 సర్వ దర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు



15-9-07 విశ్వరూప సర్వదర్శనము... తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు 15-9-07 బంగారు తిరుచ్చి ఉత్సవము... మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.30 గంటల వరకు 15-9-07 ధ్వజారోహణము...


విఘ్నేశ్వర వ్రత కథ


శౌనికాదిమునులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతము, చంద్రుని చూచినచో కలిగే దోషం మరియు దోష నివారణను సూతమహాముని చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం ఏనుగు రూపంలోని ఒక రాక్షసుడు పరమశివునికై ఘోరంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నడైన శివుడు రాక్షసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.


శివుని చూసి పరమానందభరితుడైన ఆ రాక్షసుడు భక్త సులభా నీవు ఎల్లప్పుడూ నా కడుపులో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరాడు. శివుడు తథాస్తు అన్నాడు. ఈ సంగతి తెలియని పార్వతి, భర్త జాడ తెలియక మహావిష్ణువుకు మొరపెట్టుకుంది. పార్వతి వేదనను తీర్చుటకై గజాసురుని కడుపులోని శివునికి విముక్తి కలిగించేందుకు నందిని...


Thursday, September 13, 2007

ఆకాష్-కీర్తీ చావ్లా జంటగా 'అతడే'


ఆకాష్, కీర్తీ చావ్లా హీరోహీరోయిన్లుగా ఎంకే.త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'అతడే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళంలో కూడా.. 'నినైత్తదై ముడిప్పవన్' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రొగ్రెస్‌ను నిర్మాత కె.రామాంజనేయులు హైదరాబాద్‌లో వివరించారు. త్యాగరాజాన్‌ ఇప్పటి వరకు రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఆయన లోగడ నిర్మించిన 'మానగర కావల్' అనే చిత్రం ఘన విజయం సాధించింది.


ప్రస్తుతం చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'అతడే' చిత్రం షూటింగ్ కొద్దిగా మిగిలి వుందని దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన కథ ఇది. ఉగ్రవాదులు పార్లమెంట్‌ను ఎటాక్ చేసి, ఇక్కడి వ్యవస్థను అస్తవ్యస్థం చేయాలనే...


Tuesday, September 11, 2007

బ్రహ్మోత్సవాల సృష్టికర్త బ్రహ్మదేవుడు


నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా ఏడాది పొడవునా తిరుమల వేంకటేశ్వరునికి ఎన్ని ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ.. ఏడాదికోసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వరునికి జరిపించే ఉత్సవాలను మూడు రకాలుగా ఏర్పాటు చేశారు.


మూడు రకాల ఉత్సవాలు:

మొదటిదైన శ్రద్ధోత్సవాలలో ప్రతిరోజూ భక్తులు శ్రద్ధాశక్తులతో పాల్గొనే కల్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలకు చెందినవి. కాగా రెండోదైన కాలోత్సవాలలో లోక కల్యాణం కోసం నిర్వహించే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించబడతాయి.ఇక మూడోదైన కాలోత్సవాలలో ఒక నియమిత కాలంలో వేడుకలను...