Thursday, September 20, 2007

మాడవీధులలో మారుతిపై ఊరేగిన శ్రీవారు


జగదాభిరాముడు కౌసల్య తనయుడు ఆజానుబాహువు, అరవింద దళాక్షుడైన ముగ్దమనోహర నీలవర్ణ శోభితుడు, అయోధ్య రాముని నామస్మరణయే శ్వాసగా భావించి భక్తులకు ఆదర్శనీయుడుగా నిలిచిన ఆంజనేయుని వాహనంగా చేసుకుని తిరుమలలోని మాడవీధులలో గురువారం ఉదయం రెండుగంటల పాటు శ్రీవారు సాగించిన సంచారం తిరుమలేశుని భక్తులకు అత్యంత రమణీయంగా నిలిచిపోయింది.


దేవాది దేవులు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుషులు వెంటరాగా ఆంజనేయుడు గంతులు వేస్తూ తీసుకు వెళుతున్నాడా... అన్న రీతిలో నీటి అలలపై తేలుతున్న పడవవోలె సాగుతున్న తిరుమలేశుని ఊరేగింపును వీక్షించేందుకు భక్తులు బారికేడ్ల ఆవల నిలుచుండి తదేక దీక్షతో...


భారత్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్


భారత సంతతికి చెందిన అమెరికా అంతరీక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ గురువారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. అత్యధిక కాలం అంతరీక్షంలో గడిపిన మహిళగా ఈ సంవత్సరం సరికొత్త రికార్డును నెలకొల్పిన సునీత తన వారం రోజుల భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్నారు.


దశాబ్ద కాలం అనంతరం అహ్మదాబాద్‌లోని బంధువులను సునీత కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యాసంస్థలు నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు. చారిత్రాత్మకమైన సబర్మతీ ఆశ్రమంలో...


Wednesday, September 19, 2007

'జగన్మోహిని'గా దర్శనమివ్వనున్న తిరుమలేశుడు


కలియుగదైవం శ్రీశ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ వాతావరణంలో ఒక్కోరోజు గడచి పోతున్నాయి. గత శనివారం ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు నేటి (బుధవారం)కి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు జరిగే వాహనానికి ప్రత్యేక స్థానం ఉంది. పగలు ఊరేగింపులో శ్రీనివాసుడు అమృతాన్ని పంచినప్పటి అద్భుత అందాల రాశి జగన్మోహిని అవతారంలో "దంతపు పల్లకి"లో, వెనుకనే మరో "రంగుల పల్లకి" నవనీత నందనందనుడు వెంటరాగా- సందర్శకులకు ఆనందాలను, ఆశీస్సులను అందిస్తూ అత్యంత వైభవంగా విజయవిహారం చేస్తారు.


ఈ సందర్భంగా జగన్మోహిని భుజంపై ఒక "బంగారు చిలుక"ను కనువిందుగా అమర్చుతారు. ఇంకో విషయమేమిటంటే... ఇరువురు మూర్తులు ఇతర రోజుల్లోలాగా "ఉత్సవ మండపం" నుంచి గాక నేరుగా "గర్భాలయం" నుంచే సాలంకృతులై బయటకు రావడం ఐదో రోజు...


అమెరికాలో ముందుగానే విడుదలకానున్న 'హ్యాపీడేస్'


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపీడేస్'. ఈ చిత్రంలో ఏడుగురు కుర్రాళ్లను నటీనటులుగా ఎన్నుకున్నారు. పూర్తిగా కళాశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగులో వచ్చే నెల రెండో తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత 'దిల్' రాజు తెలుగు హక్కులను పొందారు.


అయితే ఈ చిత్రాన్ని అమెరికాలో తెలుగు విడుదల తేదీ కంటే నాలుగు రోజులు ముందుగానే విడుదల చేయనున్నారు. సాధారణంగా.. రాష్ట్రంలో విడుదలైన తర్వాత విదేశాల్లో విడుదల కావడం సహజం. ప్రస్తుతం కాలంలో పెరుగుతున్న ఓవర్సీస్ మార్కెట్ దృష్ట్యా అమెరికాలో ముందుగానే...


Tuesday, September 18, 2007

కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీపతి


శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నాలుగో రోజు ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు స్వామిని శ్రీ పార్థసారథి రూపంలో శ్రీ లక్ష్మీ సమేతంగా అన్ని కోర్కెలు తీర్చే అందాల "కల్పవృక్ష" వాహనంపై ఊరేగించారు. అలాగే.. రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు పృథ్విలోని ప్రభువులందరు తన అధీనంలోని వారే అని చాటిచెప్పే విధంగా "సర్వభూపాల" వాహనంపైన ఊరేగనున్నారు.


ఈ రోజునే ప్రత్యేక సమయాలలో ఉత్సవమూర్తి శుద్ధికై చేయించే స్నానం అయిన "స్నపన తిరుమంజనం" కూడా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకను మధ్యాహ్న వేళ రంగనాయకుల మండపంలో నిర్వహిస్తారు. కాగా... బ్రహ్మోత్సవాల్లో భాగంగా...


'టీమ్ ఇండియా' కెప్టెన్‌గా 'జార్ఖండ్ డైనమెట్'


'టీమ్ ఇండియా' కెప్టెన్‌ ఎంపికలో గత నాలుగు రోజులుగా సాగుతున్న చర్చకు మంగళవారం తెరపడింది. 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ వారసునిగా 'యంగ్ డైనమెట్' మహేంద్ర సింగ్ ధోనీని జాతీయ సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టులో తొలి మూడు వన్డేలకు ధోనీని కెప్టెన్‌గా కొనసాగుతాడు.


ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత జట్టుకు ధోనీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలో సమావేశమైన బీసీసీఐ జాతీయ సెలక్టర్లు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 26 సంవత్సరాలు 73 రోజుల వయస్సు కలిగిన ధోనీ..


Monday, September 17, 2007

హంసవాహనుడైన శ్రీ చక్రధారి


శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి హంసవాహన, సరస్వతి దేవీ రూపంలో నాలుగు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. అలంకృతులైన మలయప్ప స్వామిని వారిని ఊరేగింపుగా ఊంజల్ మండపం నుంచి వాహన మండపం వద్దకు చేర్చి సమర్పణ పూర్తయిన వెంటనే స్వామి వారి హంస వాహన సేవ కొనసాగింది.


మానవునిలో దాగి ఉన్న అజ్ఞాతాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రభోదించే విధంగా జరిగిన స్వామి వారి ఊరేగింపు భక్తులను పెద్దఎత్తున ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటలకు మధ్యలో స్వామివారి సింహవాహన సేవ...