Friday, February 29, 2008


ఆదాయపన్నుదారులపై కూడా ఆర్థిక మంత్రి చిదంబరం కరుణ చూపించారు. గత ఏడాది కేవలం పది వేలు మాత్రమే ఆదాయపన్ను పరిమితిని పెంచిన ఆర్థిక మంత్రి ఈ దఫా మాత్రం దానికి నాలుగు రెట్లు పెంచారు. 2008-09 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో విత్తమంత్రి పేర్కొన్నట్టుగా.. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితిని రూ.1.95 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు పెంచారు.


ఇకపోతే వివిధ పార్టీల జయాపజయాల్లో కీలక పాత్ర పోషించే మహిళల ఆదాయపన్ను పరిమితిని కూడా పెంచారు. వీరికి 1.50 లక్షల నుంచి రూ.180 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే కార్పోట్ ఆదాయపన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇదిలావుండగా..

కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా


కాలేజీకి వెళ్లే అమ్మాయిలు చీరకట్టుకుని ఆంటీలా వెళ్లకూడదు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలాగానే వెళ్లాలి. అలాగే చిత్రంలో మనం పోషించే పాత్రకు అనుగుణంగా, సందర్భోచితంగా వేషాధారణ వుండాలి అంటోంది ఈ బెంగుళూరు మోడల్. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..! ఆమే నండి "బొమ్మరిల్లు" భామ. జెనీలియా డిసౌజా.


ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో జెనీలియా బొమ్మరిల్లు చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే "సత్యం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ నటనకు రాకముందు మోడల్‌గా చేసేది. పార్కర్ పెన్నులు, ఫెయిర్ అండ్ లౌవ్లీ...