Saturday, October 27, 2007

అర్థం చేసుకోండి.. అందరం కలసిపోదాం: శ్రీజ


తన కుటుంబ సభ్యులు తమ ప్రేమను అర్థం చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ మరోసారి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసింది. ఇరువురు కుటుంబ సభ్యులు ఒక అవగాహనకు వస్తే.. రెండు కుటుంబాలు కలసి పోవచ్చని ఆమె సూచించింది. ఢిల్లీలో ఉంటున్న శ్రీజ దంపతులు శుక్రవారం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం.


తన తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాం అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే.. మనస్పూర్తిగా క్షమించమని అడుగుతున్నాం. అయితే.. అత్తమామయ్య వాళ్లు మాత్రం త్వరగా ఇంటికి రమ్మంటున్నారు. మా కుటుంబం తరపు నుంచే...


మరువలేను సారీ....


యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు

జాజిపువ్వు మనసులాంటి బంగారీ

జంటగా ఉండాలి ప్రతిక్షణం యిహ మరీ

బంతిపువ్వులాంటి ఓ నా బంగారీ

బరువు నిండిన బాధ ఎప్పటిదాకో మరీ


స్వర్ణకమలం లాంటి నా బంగారీ

స్వంతమవుతావుగా నాకు తెలుసు మరీ

ప్రతి సూర్యకిరణంలో నిండిన ఓ నా బంగారీ

ప్రతిరోజూ ప్రత్యక్షమవుతాయి నా ముందుమరీ

కలువరాజు పంచే కమ్మని వెన్నెల లాంటి బంగారీ



Friday, October 26, 2007

దూకుడు కొనసాగిస్తాం: రాంచీ రాకెట్


భవిష్యత్‌లో కూడా భారత్ జట్టు దూకుడును కొనసాగిస్తుందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. జార్ఖండ్ ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో రాంచీ రాకెట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచేందుకు తాము దూకుడును కొనసాగిస్తాయమని స్పష్టం చేశాడు.


భారత్ సాధించిన విజయాలు జట్టు సభ్యుల సమిష్టి కృషి ఫలితం అని ధోని అన్నాడు. కార్యక్రమంలో ధోనికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించిన ఆశ్చర్యకర బహుమతి...టయోటా కరోలా లగ్జరీకారు, రూ. ఐదు లక్షల చెక్‌ను జార్ఖండ్ ముఖ్యంత్రి మధు కొడా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...


Wednesday, October 24, 2007

మా ప్రేమ కథకు నాన్నే నిర్మాతగా ఉండాలి: శ్రీజ


మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌ల వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అయితే.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో మాత్రం.. శ్రీజ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.


తాజాగా.. తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్‌ చిత్రరంగంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంటోంది. ఒకవేళ తమ ప్రేమ కథ తెరకెక్కితే.. ఆ చిత్రానికి తన తనండ్రి మెగాస్టారే నిర్మాతగా ఉండాలని శ్రీజ భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. ఈ చిత్రంలో తన భర్త శిరీష్‌తో కలసి నటించేందుకు సిద్ధంగా...


జెస్సీ మెట్‌కాఫ్‌ సరసన శివాజీ భామ


తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన అందాల హీరోయిన్ శ్రియ నటించింది ఒక్క చిత్రమే కావచ్చు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న శ్రియ బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం కూడా సాఫీగా సాగింది.


అలాగే.. హాలీవుడ్ నటుడు జెస్సీ మెట్‌కాఫ్ సరసన నటించే సువర్ణావకాశం తాజాగా కొట్టేసింది. అశోక్ అమృతరాజ్ సొంత నిర్మాణ సంస్థ అయిన హైడ్ పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జెస్సీ మెట్‌కాఫ్ హీరోగా నిర్మించనున్న...


Tuesday, October 23, 2007

"మిస్సమ్మ"కు పెళ్ళయిపోయింది!


ప్రముఖ సినీనటి భూమిక ముంబయికి చెందిన యోగా మాస్టర్ భరత్ ఠాగూర్‌ను విజయదశమి నాడు వివాహం చేసుకుంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ సరసన "యువకుడు" చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా భూమిక తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అనంతరం తమిళ, హిందీ సినిమాల్లో నటించడం ద్వారా తనదైన ప్రతిభను భూమిక చాటుకుంది.


ఈ నేపథ్యంలో ఆమె చిరకాల మిత్రుడు, యోగామాస్టర్ భరత్ ఠాగూర్‌, భూమికల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందంటూ...వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సమర్థిస్తూ త్వరలో తామిరువురూ పెళ్ళి చేసుకోబోతున్నామంటూ భూమిక చెపుతూ వచ్చింది. ఆ పెళ్ళిపై ఊహాగానాలను తెరదించుతూ నాసిక్‌లో అత్యంత సన్నిహితులు, స్నేహితుల...


నాడీ జ్యోతిష్యం : తాళపత్రాలలో భవిష్యత్


మన దేశంలో జ్యోతిష్యం వటవృక్షం నీడలో హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం, నక్షత్ర భవిష్యవాణి ఇలా అనేక రకాల పద్ధతులు వేళ్ళూనుకుని ఉన్నాయి. ఈ పద్దతులలో శతాబ్దాల కాలంగా అత్యంత ప్రాచుర్యం పొందినదిగా నాడీ జ్యోతిష్యం పేర్కొనబడింది. ఏదినిజం శీర్షికలో భాగంగా, ఈ వారం ఆశ్చర్యానికి గురి చేసే జ్యోతిష్యాన్ని మీకు పరిచయం చేసేందుకు తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన వైదీశ్వరన్ దేవాలయానికి తీసుకు వెళ్తున్నాం.


వైదీశ్వరన్ దేవాలయానికి చుట్టుపక్కల మీ భవిష్యత్తును, మీ తలరాతను తెలియజెప్పే నాడీజ్యోతిష్యానికి చెందిన పలు ప్రకటన బోర్డులు మీకు అడుగడుగునా కనిపిస్తూ మీకు స్వాగతం చెపుతుంటాయి. వలం తమిళనాడు నుంచేకాక దేశంలోని పలు ప్రాంతాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చే ప్రజలు వైదీశ్వరుని దర్శనం...


Monday, October 22, 2007

సంజయ్‌దత్‌కు తీర్పు కాపీ


బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ సోమవారం టాటా కోర్టు నుంచి 4,000 పేజీల తీర్పు కాపీని అందుకున్నారు. తీర్పు కాపీని అందుకున్న సంజయ్‌దత్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేసారు. అనంతరం సంజయ్‌దత్‌ను పోలీసులు ఆర్ధర్‌ రోడ్డు జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా టాడా కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు ఉపకరించే న్యాయపరమైన అంశాలను సంజయ్‌దత్ న్యాయవాదులు పరిశీలిస్తున్నారు.


ఆయుధాల చట్టం కింద టాడా కోర్టు సంజయ్‌దత్‌ను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజయ్‌దత్‌తో పాటు ఆయన సహచరులు కేర్సీ అడ్జానియా, యూసఫ్ నల్వల్లా...


శ్రీజ దంపతులకు పోలీసు రక్షణ: ఢిల్లీ హైకోర్టు


శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులకు రక్షణ కల్పించవలసిందిగా ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా వారిరువురికి ఎటువంటి హాని తలపెట్టబోమంటూ చిరంజీవి కుటుంబసభ్యులు హామీ పత్రాన్ని అందించాలని కోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ, శిరీష్‌లు ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో తమకు ప్రాణాపాయం కలుగుతుందని, తమకు రక్షణ కల్పించాలంటూ...