Friday, August 17, 2007

పాత సినిమాల కలయిక "యమదొంగ"

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్, ప్రియామణి, మోహన్‌బాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, శివపార్వతి తదితరులు..
కెమెరా: సెంథిల్‌కుమార్
సంగీతం: కీరవాణి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: చెర్రి
దర్శకుడు: రాజమౌళి

క్లుప్తంగా చెప్పాలంటే... చాలా సినిమాల కలయిక. కాపీ చేసినా క్లాస్‌గా చేశారు దర్శకుడు. రాజమౌళి, యమలోకం వెళ్ళడం "యమగోల", చిరంజీవి "యముడుకు మొగుడు" చిత్రం, కొన్ని సీన్స్ దానవీరసూరకర్ణ, ఇలా రకరకాలుగా సినిమాలు గుర్తుకురాకమానవు.

కథ: రాజా (జూనియర్ ఎన్టీఆర్) చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికేస్తుంటాడు. ఆ ఊరిలోనే ఓ జమిందారీ కూతురు మహేశ్వరి (ప్రియామణి)ని ఓ రోజు ప్రమాదంలో రాజా కాపాడతాడు. దానికి గుర్తుగా నరిసింహస్వామి గొలుసు బహుమతిగా ఇస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాపాడతాడు. మరోవైపు... ఎంఎస్. నారాయణ ఓ ధనికుడు. తన భార్యరు ఓ ఖరీదైన గౌన్ కొంటాడు. కానీ అది దొంగలించబడుతుంది. దాన్ని తెచ్చేపనిని ఈ దొంగ (రాజా)కు అప్పగిస్తాడు. దీన్ని తెస్తే పదిలక్షలు ఇస్తాననే డీల్ కుదుర్చుకుంటాడు.........


వెబ్ దునియా తెలుగులో కనిపించే ఆసక్తికరమైన కథనాలను మీరు ఇక్కడ చదవచ్చు. క్లిక్ చెయ్యండి

ఆ పెళ్ళికి పిలవండి.. నేను కూడా వస్తా: నిఖిత


ఇ.వి.వి సత్యనారాయణ కుమారుడి ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయం అవుతున్న "హాయ్" అనే చిత్రంలో పలుకరించిన నటి నిఖిత. ఆమె నవ్వులో ప్రత్యేకత ఉంది. పన్నెండేళ్ల వయస్సులోనే ఏవో గీతాలను రాసి ఇంట్లోవారి చేత రచయిత్రిగా ముద్రవేసుకుంది. ఆ మధ్య కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. "సంబరం", ఖుషీ ఖుషీగా, "ఏమండోయ్ శ్రీవారు", "నీ నవ్వేచాలు" వంటి చిత్రాల్లో నటించిన నిఖిత... ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుంది. లేటెస్ట్‌గా నటి రాశి సమర్పిస్తోన్న చిత్రంలో రిషి సరసన నటిస్తోంది. హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నిఖితతో కాసేపు...

ప్రశ్న: తెలుగులో గ్యాప్ రావడానికి బలమైన కారణం ఉందా?

జ: బలమైన కారణాలు ఏమీలేవు. గ్యాప్ అనేది లేదు. తమిళం, మలయాళం, కన్నడ ఇలా పలు చిత్రాల్లో చేస్తున్నాను. దాదాపు 19 చిత్రాలు పూర్తిచేశాను. దాని వల్ల తెలుగులో విరామం అనిపించవచ్చు......


వెబ్ దునియా తెలుగులో కనిపించే ఆసక్తికరమైన కథనాలను మీరు ఇక్కడ చదవచ్చు. క్లిక్ చెయ్యండి

నేడు సీపీఎం పోలిట్‌బ్యూరో కీలక సమావేశం

అత్యున్నత నిర్ణయాత్మక విధాన మండలిగా భావించే 13 మంది సభ్యుల సీపీఎం పోలిట్ బ్యూరో శుక్రవారం భేటీ కానుంది. ఇందులో భారత్-అమెరికా అణు ఒప్పందంపై కేంద్రంలోని యూపీఏ సర్కారుతో ఉన్న సంబంధాలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే సీపీఐ జాతీయ కమిటీ కూడా ఇదే అంశంపై దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశంకానుంది. ఈ సమావేశాల్లో కమ్యూనిస్టు వృద్ధనేతలైన జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సూర్జీత్‌లతో పాటు.. మరికొందరు సీనియర్ నేతలు కూడా హాజరుకావచ్చని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుండగా.. అణు ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పిన వామపక్షాలు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని పట్టుపట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా లెఫ్ట్-యూపీఏ కో-ఆర్డినేషన్ కమిటీ నుంచి వైదొలగే అంశం, అణు ఒప్పందంపై సర్కారు వెనక్కి తగ్గే వరకు మద్దతు ఉపసంహరించుకునే విషయాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఇప్పటికే కో-ఆర్డినేషన్ కమిటీ నుంచి వైదొలగి, ప్రభుత్వాన్ని పడిపోకుండా చూస్తూ.. వేచి చూసే ధోరణి అవలంభించాలని కొందరు వామపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.

వెబ్ దునియా తెలుగులో కనిపించే ఆసక్తికరమైన కథనాలను మీరు ఇక్కడ చదవచ్చు. క్లిక్ చెయ్యండి

'టాప్-50' భారతీయుల్లో సూపర్ స్టార్‌ రజనీకాంత్

అమెరికాకు చెందిన ప్రఖ్యాత బిజినెస్ వీక్ నిర్వహించిన ఓ సర్వేలో టాప్-50 భారతీయుల్లో దక్షణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు స్థానం దక్కింది.

భారత 60వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ పత్రిక సర్వే నిర్వహించింది. ఇందులో సినిమా, క్రీడలు, రాజకీయం, తదితర అన్ని రంగాల్లోని సర్వే నిర్వహించింది.


వెబ్ దునియా తెలుగులో కనిపించే ఆసక్తికరమైన కథనాలను మీరు ఇక్కడ చదవచ్చు. క్లిక్ చెయ్యండి