యిమ్మడిశెట్టి వెంకటేశ్వర్రావు
కుర్రాళ్లతో కాలేజీ నందనవనంగా ఉంది. ఆకాశాన్నంటే వృక్షాల నీడన బోయ్స్ అండ్ గాళ్స్ ఊసులాడుకుంటున్నారు. మరోవైపు తమకే తెలిసిన తీయని నవ్వులను కాలేజీ ప్రాంగణంలో విరబూయిస్తున్నారు అమ్మాయిలు. ఆ అందమైన నవ్వులు వెన్నెల తెచ్చిన వసంతంలా ఉంది. ఆరడగుల అందగాడుగా పేరుతెచ్చుకున్న నరేంద్రకు మాత్రం కోపం నషాలనికంటుతోంది. ఎందుకంటే అతనికి ఆడాళ్లంటే ద్వేషం. ఎందుకో... అని ఎవరైనా అడిగితే... రెండు ముక్కల్లో మాత్రం చెప్పడు. పరిచయంతో మొదలై దానికి మహాకావ్యం రూపు తెచ్చే ప్రయత్నం చేస్తాడు.
అందుకే అతనివద్ద అమ్మాయిల గొడవను ఎవరూ ఎత్తరు. ఆడాళ్లంటే తనకు ఉన్న అయిష్టతను ఎవరూ అడగకుండానే అందరి వద్ద ప్రకటించటం అతని దినచర్యలో ఓ భాగమైపోయింది. ఈ విషయం ఆ నోటా... ఆ నోటా అదే కళాశాలలో చదువుతున్న మల్లికను చేరింది. సృష్టికి మూలం స్త్రీయే అని అతనికి తెలియజెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది మల్లిక. ఈ మల్లిక ఓ చూపు విసిరితే... చాలు...
No comments:
Post a Comment