పిల్లలూ! దీపావళి పండుగ అంటే మీకు చాలా ఇష్టం కదూ! దీపావళి వచ్చిందంటే మీ కళ్ళలో వెలిగే సంతోషం ముందు కోటి మతాబుల వెలుగు కూడా దిగదుడుపే. స్కూల్ లేకపోయినా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపడం కొంచెం కష్టమే అయినా అలమరలో దాచుకున్న టపాసులు గుర్తుకు రాగానే నిద్రమత్తు ఇట్టే వదిలిపోతుంది.
తల స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కొత్త బట్టలు తొడుక్కుని, నాన్న కొని తెచ్చిన టపాసులను తీసుకుని మేడ మీదకు వెళ్ళి వాటిని కాలుస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరి మిమ్మల్ని ఇంత ఆనందపెడుతున్న దీపావళి ఎలా వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాందీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు...
No comments:
Post a Comment