ఆంజనేయ స్వామి భక్తులకు నయనానందం కలిగిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా విన్నూత్నమైన ప్రదర్శనశాల లక్నోలో ఏర్పాటైంది. ఆంజనేయ స్వామికి చెందిన అరుదైన వస్తువులతో నిండిన ఈ ప్రదర్శనశాల 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్'లో స్థానం సంపాదించుకుంది. ఈ బృహత్కార్యం సాకారం వెనుక హనుమత్ భక్తుడైన సునీల్ గొంబార్ కృషి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆంజనేయస్వామికి అనేక వస్తువులను సునీల్ సేకరించారు.
లక్నోలోని ఇందిరానగర్‌లో గల తన నివాసమైన 'బజ్‌రంగ్ నికుంజ్' మొదటి అంతస్తులో తను సేకరించిన వస్తువులను సునీల్ ప్రదర్శనకు ఉంచారు. శ్రీరామచంద్రుని 48 గుర్తులను కలిగిన 'చరణ్ పాదుక'(అడుగు జాడలు)ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా వెండితో అలంకరించబడి ఉన్నాయి. శ్రీరాముడు స్మరించిన హనుమంతుని సహస్ర నామాలను (వెయ్యి పేర్లు) కూడా మీరు...
No comments:
Post a Comment