Tuesday, November 6, 2007

అష్టైశ్వర్యాలను తెచ్చే దివ్య దీపావళి


జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళినాడు తెల్లవారు ఝామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు నిర్వహించాలి. మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానమాచరించాలి. ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి.


ప్రధానంగా ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు... ఐదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. దీపావళినాడు పగలు ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి భోజనం చేయాలి. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి, పితృదేవతలకు దారి చూపించాలి. ఆ తర్వాత....


No comments: