దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను "టీమ్ ఇండియా" కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమెట్ ధోనీ నేతృత్వంలోని 'యువసేన'దే పై చేయిగా నిలిచింది. లీగ్ మ్యాచ్‌లో బౌలౌట్ పద్దతిలో పాక్‌ను ఓడించిన భారత జట్టు సోమవారం జరిగిన మ్యాచ్‌లోను ఐదు పరుగులు తేడాతో గెలిచి ట్వంటీ-20 ప్రపంచ తొలి ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇర్ఫాన్ పఠాన్ సొంతం చేసుకున్నాడు.
అంతర్జాతీయ ఫైనల్ మ్యాచ్‌లో దాయాదులుగా పేరుగాంచిన పాకిస్తాన్-భారత్ జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై ఉన్న జోహెన్స్‌బర్గ్‌లోని వాండర్సన్ స్టేడియంలో తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. భారత జట్టులో గౌతం గంభీర్ (75), రోహిత్ శర్మ (30)లు మాత్రమే రాణించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లలో వీరబాదుడు బాదిన యువరాజ్ సింగ్...
No comments:
Post a Comment