Thursday, September 6, 2007

ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం


నాట్‌వెస్ట్ సిరీస్ కీలకమైన ఆరో వన్డే‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ అందించిన 317 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 3-3తో సమం అయింది.

12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా ఊతప్ప (47, 8 ఫోర్లు) చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి నాలుగు ఫోర్లతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్‌కు ఓపెనర్లు సౌరవ్ గంగూలీ (53), సచిన్ టెండూల్కర్ (94) మరోసారి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 150 పరుగులు జోడించారు.

తొలి వికెట్‌గా గంగూలీ వెనుదిరిగిన అనంతరం వచ్చిన గౌతం గంభీర్‌ (47) కాస్త తేడాతో అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆరు పరుగుల తేడాతో వన్డే‌ల్లో 42వ సెంచరీ చేజార్చుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సచిన్ భారత్ లక్ష్య సాధనలో...


మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి.

No comments: