ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నరేష్, శర్వానంద్, కమిలినీ ముఖర్జీ ముఖ్య తారాగణంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. సెప్టెంబరు 10 వరకూ నరేష్, శర్వానంద్ , కమిలినీ ముఖర్జీలపై సీతారామశాస్త్రి రాసిన మూడు పాటలను చిత్రీకరించనున్నారు.
వీరితోపాటు అభిషేక్, బ్రహ్మానందం కూడా పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను కూడా తీయనున్నారు. ఈ విషయాలను నిర్మాత జాగర్లమూడి సాయిబాబు చెబుతూ, జానకి కోసం ఇద్దరు అబ్బాయిలు సాగించే జీవన ప్రయాణం ఈ చిత్ర ఇతివృత్తమని....
No comments:
Post a Comment