Wednesday, August 29, 2007

వేల్స్ యువరాణి డయానా బాల్యం

డయానా ఫ్రాన్సెస్ స్పెన్సర్ ఇంగ్లాండ్‌లోని నార్‌ఫోల్క్ ప్రాంతంలోని సండ్రింగామ్‌లో గల పార్క్ హౌస్‌లో 1961వ సంవత్సరం జూలై ఒకటవతేదీన జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, విస్కౌంటెస్ అల్‌థార్ప్. సండ్రింగామ్‌లోని సెయింట్ మేరీ మాగ్డలెనే చర్చిలో బాప్టిజాన్ని స్వీకరించారు. తల్లిదండ్రులు విడాకులు పుచ్చుకోవడంతో డయానా తల్లి తన ఇరువురు పిల్లలను లండన్‌లోని నైట్‌బ్రిడ్జ్‌కు తరలించింది.

అక్కడే డయానా తన పాఠశాల విద్యకు శ్రీకారం చుట్టారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా తండ్రితో గడిపేందుకు డయానా ఆమె సోదరుడు వెళ్ళగా, వారిరువురిని వారి తల్లికి తిరిగి అప్పగించేందుకు డయానా తండ్రి నిరాకరించాడు. తన పిల్లలను తనకు అప్పగించాల్సిందిగా డయానా తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం డయానా తండ్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

తాతగారు మరణించడంతో డయానా తండ్రి ఎనిమిదవ ఎర్ల్ స్పెన్సర్‌గా రూపాంతరం చెందారు. అదేసమయంలో చిన్నారి డయానా లేడీ డయానా స్పెన్సర్‌గా మారారు. తదనంతరం చిన్ననాటి నుంచి నివసిస్తున్న పార్క్ హౌస్ టిని వదలి తన కుటుంబానికి చెందిన 16వ శతాబ్దంనాటి గృహానికి తరలి వెళ్లారు.

మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి

No comments: