విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో మరో నంది అవార్డు చేరింది. తాను నటించిన "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యాడు. 2007 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు సోమవారం ప్రకటించింది. ఇందులో ఉత్తమ చిత్రంగా "మీ శ్రేయోభిలాషి" ఎన్నికైంది. ద్వితీయ చిత్రంగా "హ్యాపీడేస్", తృతీయ చిత్రంగా "లక్ష్యం" ఎంపికైంది.
అలాగే ఉత్తమ దర్శకుడుగా కృష్ణవంశీ (చందమామ), 'మంత్ర' చిత్రంలో అద్భుత నటనతో ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమలో ప్రశంసలను అందుకున్న హీరోయిన్ ఛార్మికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే.. ఉత్తమ సంగీత దర్శకునిగా.. మిక్కీజే మేయర్ (హ్యాపీడేస్), ఉత్తమ గాయకుడిగా కార్తీక్ (హ్యాపీడేస్), ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా ఆహుతి ప్రసాద్ (చందమామ), ఉత్తమ వినోదాత్మక చిత్రంగా "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..", ఉత్తమ కుటుంబ చిత్రం "చందమామ" ఎంపికైంది.
No comments:
Post a Comment