Monday, May 18, 2009

ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను హతమార్చిన లంక



శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ శ్రీలంక దళాల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు.


ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. దీంతో సహనం కోల్పోయిన సైన్యం ప్రభాకరన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాకేట్ లాంచర్‌ను వదిలారు. దీంతో వాహనంలో ఉన్న ప్రభాకరన్‌తో సహా కీలక ఎల్టీటీఈ నేతలు మృతి చెందారు.


మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

కిక్ ట్రైలర్ చూడండి


రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన కిక్ సినిమా సైతం అలాంటిదేనని చెప్పవచ్చు. కిక్ చిత్రం దొంగా పోలీస్ కథ. శ్రీనువైట్ల చిత్రాల తరహాలో ఢీ, రెడీ సినిమా ఫార్మెట్‌లో కామెడీని చొప్పించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.


థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న రవితేజ కిక్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.

Tuesday, March 10, 2009

పార్టీకోసం రాజకీయాల్లోకి వచ్చా: బాలయ్య



కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు.


ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. అయితే తదనంతరం జరిగిన...


మరిన్ని వివరాల కోసం...

హోళికా పూర్ణిమ... మీ సౌందర్య దేవత నడిచొస్తోంది



సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు.


ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ-నట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు.


శాలీనుడనే పేరుగల నాయకుడుండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటిరాత్రి లోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలూ వాడిపోలేదు. ఏ దుస్తులు నలగలేదు. అసలు ఆమెలో కించిత్ మార్పు సైతం కానరాలేదు. ఒకటి.. రెండు.. మూడు రాత్రులు ఇదే రీతిలో గడిచిపోయాయి. రాత్రి వేళ ఆమె గదిలోకి వెళ్లడం... ఉదయాన ఎలా వెళ్లిందో అలానే తిరిగి రావడం జరిగింది. దాంతో ఆమె మానసికంగా కుంగి పోయింది. తన సౌందర్యాన్ని చూసి భర్తలో...


ఇంకా చదవండి


Monday, January 12, 2009

సత్యం రాజు మోసగాడా...?



ప్రపంచంలోని 66 దేశాలలో ఐటీ తెలుగు తేజం... సత్యంవిదేశాలలో పనిచేసే సాఫ్ట్‌వేర్ నిపుణులలో దాదాపు 40 శాతం మందిని తెలుగునేల నుంచి అందించిన సత్యంఇలా ప్రపంచ ఐటీ చిత్ర పటంలో క్రమంగా ఎదిగి ఒకనాడు ప్రపంచ ఐటీ రారాజు బిల్‌గేట్స్ సరసన కూర్చున్న మేటి సత్యం...తెలుగు యువతలో మనోధైర్యాన్ని నింపి... విదేశీ గడ్డపై తెలుగు యువత రాణించగలదనీ నిరూపించిన సంస్థ.


యువతకు కాసుల వర్షం కురిపంచిన సత్యం... ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రాజధానిగా సైబరాబాదును ప్రపంచానికి చాటిచెప్పింది. దాదాపు 60 వేల కుటుంబాలకు... కూడు, గుడ్డ, నీడనిస్తూ... తెలుగు యువతకున్న మేధా సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఏకైక సత్యం సామ్రాజ్యాధినేత బైర్రాజు రామలింగరాజు...


మరింత సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి

వెంకీ ఖాతాలో మరో నంది



విక్టరీ వెంకటేష్‌‌ కెరీర్‌లో మరో నంది అవార్డు చేరింది. తాను నటించిన "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యాడు. 2007 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు సోమవారం ప్రకటించింది. ఇందులో ఉత్తమ చిత్రంగా "మీ శ్రేయోభిలాషి" ఎన్నికైంది. ద్వితీయ చిత్రంగా "హ్యాపీడేస్", తృతీయ చిత్రంగా "లక్ష్యం" ఎంపికైంది.


అలాగే ఉత్తమ దర్శకుడుగా కృష్ణవంశీ (చందమామ), 'మంత్ర' చిత్రంలో అద్భుత నటనతో ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమలో ప్రశంసలను అందుకున్న హీరోయిన్ ఛార్మికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే.. ఉత్తమ సంగీత దర్శకునిగా.. మిక్కీజే మేయర్ (హ్యాపీడేస్), ఉత్తమ గాయకుడిగా కార్తీక్ (హ్యాపీడేస్), ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా ఆహుతి ప్రసాద్ (చందమామ), ఉత్తమ వినోదాత్మక చిత్రంగా "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..", ఉత్తమ కుటుంబ చిత్రం "చందమామ" ఎంపికైంది.


మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి