బొజ్జ గణపయ్య ఆకృతిపై ఎన్నో రకాల చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం లాంటి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలుగా చెప్పుకోవచ్చు.వినాయకుడి ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉంటుందని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ఇష్టమైన అంశం.
ఓంకార రూపంలో రకరకాల ఆకృతుల్లో కొలువైన ఓంకార వినాయకుడి బొమ్మలు కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. ఎంతోమంది సృజనాత్మక కళాకారులు బొజ్జ గణపయ్య రూపాన్ని తమ కుంచెలతో ప్రతిష్టించారు.వినాయకుని తొండము "ఓం"కారానికి సంకేతం కాగా...ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము కాగా...చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము.
No comments:
Post a Comment