మైనర్ బాలిక సమ్మతితో సంబంధం పెట్టుకున్నా సరే దానిని మహిళపై జరిగిన అత్యాచారంగానే లెక్కించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన ప్రియుడితో లేదా భాగస్వామితో ప్రేమతో ఇష్టపూర్వకంగానే ఆమె శారీరక సంబంధంలోకి పోయినప్పటికీ ఈ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్యానానికి కారణమైన కేసు వివరాలలోకి వెళితే... పంజాబ్ రాష్ట్రానికి చెందిన కుమార్ 16 ఏళ్ల వయసున్న బాలికతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తలిదండ్రులు మరోవైపున తమ కూతురును అపహరించి, అత్యాచారం చేశాడని కుమార్‌పై ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పంజాబ్ సెషన్స్ కోర్టు నిందితుడైన కుమార్‌కు ఏడే్ళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
No comments:
Post a Comment