Tuesday, December 30, 2008

శతాబ్ది న్యూస్ పోల్‌లో ఒబామాకే అగ్రస్థానం



అమెరికా కాబోయే అధ్యక్షుడు ఒబామా బరాక్ ఈ శతాబ్ది వార్తల్లో ప్రథముడిగా ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంలో ఒబామా సాగించిన ప్రస్థానానికి ప్రపంచం మొత్తం మీద అద్వితీయమైన కవరేజ్ వచ్చిందని ప్రపంచ వ్యాప్త మీడియా సర్వేలో తెలిసింది. శతాబ్ది మొత్తంలో ఇంత విస్తృత కవరేజీని మరే వ్యక్తి కాని సంఘటన కాని పొందలేదని ఈ సర్వే చాటి చెప్పింది.


ప్రపంచంలోని మరే ఇతర సంఘటనతో అయినా పోల్చి చూస్తే ఒబామా ఎన్నికల ప్రచారానికి రెండు రెట్లు అధికంగా కవరేజ్ వచ్చిందని సర్వే చెప్పింది. ఒబామాకు దక్కిన ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో ఉందని ఈ సర్వేని నిర్వహించిన గ్రోబల్ లాంగ్వేజ్ మోనిటర్ అధ్యక్షుడు పాల్ పేయాక్ చెప్పారు. ప్రపంచాన్ని ఒబామా తన చెంత కట్టిపడేసుకున్నారని పాల్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ బ్లాగులలో అత్యధిక ప్రచారం ఎవరు పొందారనే అంశంపై ఈ సర్వే పరిశోధించింది.


మరిన్ని వవరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల నామ సంవత్సరం... '2008'



సంవత్సరం-2008. ఈ యేడాదికి దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికార మార్పిడికి కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే ఈ యేడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈశాన్య భారతం మొదలుకొని.. ఉత్తర, దక్షిణాదిల్లోని కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.


ఇలాంటి వాటిలో కీలకమైనవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు. రెండు మూడు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి జరిగింది. రాజస్థాన్‌ రాష్ట్రంలో భాజపా.. కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి...


మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Friday, December 12, 2008

ప్రాణం పోసిన హిందూ హృదయం

రఘుపతి వస్తానని పోన్ చేశాడు. సరే, రారా . ఇంటివద్దే ఉన్నాను అన్నాను.ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఎటూ వెళ్లడంలేదు.మిత్రులుకూడా చాలామంది రావడం తగ్గించేశారు. ఎవరి పనులు వాళ్లకు.. సమయం సరిపోవడంలేదేమో.పనమ్మాయిని పిలిచి మేడమీద గది శుభ్రంచేయమన్నాను. ఆ గది నా సామ్రాజ్యం. అయితే అక్కడికి వెళ్లి చాలా వారాలయింది.

అంతకు ముందు ప్రతి శని, ఆదివారాలు నా మిత్రులతో, మేడపై గదిలో చాలా సరదాగా గడచిపోయేవి. కొందరితో పేక ఆట, కొందరితో చదరంగం, చందు, నాగరాజు వంటివారితో సాహిత్య చర్చ. ఇలా ఉండేది నా వారాంతపు జైత్రయాత్ర.

ఇంకా చదవండి

గజినీ వస్తున్నాడు... ట్రెయిలర్ చూడండి



క్రిస్మస్ కానుకగా దేశవ్యాప్తంగా విడుదలకానున్న అమీర్‌ఖాన్ "గజినీ" విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. గజినీ ట్రెయిలర్‌లో అమీర్ ఎమోషన్స్ చూసిన సినీ జనం, ఈ చిత్రం బిగ్ హిట్ అవుతుందని చెపుతున్నారు. తమిళ "గజినీ" చిత్రాన్ని రూపొందించిన ఎఆర్ మురుగదాస్ మరిన్ని మెరుగులు దిద్ది ఈ చిత్రాన్ని రూపొందించారని యూనిట్ సభ్యులంటున్నారు.


ఇక అమీర్‌ఖాన్ విషయానికి వస్తే... చిత్రం షూటింగ్ ప్రారంభించింది మొదలు అమీర్ "గజినీ" గెటప్పులోనే దర్శనమిచ్చాడు. తలపై సగం వెంట్రుకలు, తలకు ఒకవైపు దెబ్బ తగిలినట్లుండే ఆనవాళ్లు... అమీర్‌ఖాన్‌కి మంచి క్రేజ్‌నే తెచ్చాయి. ఇకపై ఇదే గెటప్‌తో అమీర్ తిరుగుతాడేమోనన్నంత స్థాయిలో అమీర్ గజినీ స్టయిల్ ఉంది మరి. నటి అసిన్‌కి సైతం అమీర్ "గజినీ" పుణ్యమా అని బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సులొస్తున్నాయి. అసిన్ నటనను అమీర్ స్వయంగా చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాడని భోగట్టా.


మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి



Tuesday, October 14, 2008

రజనీ...రాజకీయాల్లోకి రా...



తెలుగు చలన చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై అభిమానుల ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఏకంగా తన అనుమతి లేకుండానే.. రాజకీయ పార్టీని ప్రారంభించి, జెండాను ఎగురవేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రజనీ.. రాజకీయ రంగ ప్రవేశం చేయాలని తనను ఎవరూ నిర్భంధించ లేరని స్పష్టం చేశారు.


అంతేకాకుండా రాజకీయ గందరగోళానికి కారకులైన కోయంబత్తూరు జిల్లా అభిమానులకు రజనీకాంత్‌ సోమవారం లీగల్‌ నోటీసులు సైతం జారీ చేశారు. అఖిల భారత రజనీకాంత్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణకు నోటీస్‌ జారీ చేస్తూ, 15 రోజుల్లోగా సమాధానం...


హైదరాబాద్ బేగంపేటలో ఎయిర్ షో

నాలుగు రోజుల పాటు సాగే విమానయాన శాఖ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ విమాన ప్రదర్శన మరియు సదస్సు నేడు ప్రారంభం కానుంది. పౌరవిమానయాన శాఖతో కలిసి ఇండియా ఏవియేషన్-2008 సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మ ప్రదర్శన మరియు సదస్సుకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 200లకుపైగా విమానయాన సంస్థలకు చెందిన విమాన ప్రదర్శన... ఈ సదస్సులో ప్రదర్శనకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో బేగంపేట విమానాశ్రయం మరో సారి కళకళలాడనుంది. బోయింగ్ 777తో సహా వివిధ రకాల హెలి‌కాఫ్ట్‌ర్లు, విమానాలు ఒకరోజు ముందుగా ఇక్కడకు చేరి తమతమ స్టాల్‌లకు తుది మెరుగులు దిద్దుకున్నాయి.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Wednesday, September 17, 2008

'మెగా' రాష్ట్ర పర్యటనకు రంగం సిద్ధం..!

జన హోరులో తడిసి ముద్దయ్యేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. తన తొలి రాజకీయ బహిరంగ సభను అశేష జనవాహిని మధ్య దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయేలా నిర్వహించారు. అదేరీతిలో తన రాష్ట్ర పర్యటనను నిర్వహించాలని మెగాస్టార్ సన్నిహితులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా ఈనెలాఖరు నుంచి మెగా రాష్ట్ర పర్యటన ప్రారంభమవుతుంది.

ముఖ్యంగా వచ్చే 27, 28, 30 తేదీల్లో ఏదో ఒక రోజు నుంచి శ్రీకారం చుట్టొచ్చని ప్రజారాజ్యం పార్టీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ యాత్ర ప్రారంభ ప్రాంతంపై భిన్నకథనాలు వినొస్తున్నాయి. చిరంజీవి తన రాజకీయ ప్రవేశం రాయలసీమ ప్రాంతం నుంచి చేశారని, అందువల్ల రాష్ట్ర పర్యటన మాత్రం కోస్తాంధ్ర నుంచి చేపట్టాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. మరికొందరు మాత్రం బాగా వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ నుంచి నిర్వహించాలని సూచిస్తున్నారు...


ఇంకా చదవండి

Tuesday, September 2, 2008

మెగాస్టార్ ప్రజారాజ్యం ఆవిర్భావం



తాను నాయకుడిని కానని జన సేవకుడిగా మిగిలిపోవాలన్నది తన అభిమతమని చిరంజీవి తెలిపారు. ఆయన చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..... ప్రజా సేవ కోసం ఆహ్వానం వచ్చింది. ప్రజల ఆహ్వానం నిండుగా మెండుగా ఉంది. వాళ్ళ పిలుపుపై ఆత్మస్థైర్యం. అబ్దుల్ కలాం చెప్పారు. సేవ తత్పరత భావం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని....



మరిన్ని వివరాలకు వెబ్‌దునియా తెలుగు చూడండి

మైనర్ బాలికతో ప్రణయం సైతం అత్యాచారమే...


మైనర్ బాలిక సమ్మతితో సంబంధం పెట్టుకున్నా సరే దానిని మహిళపై జరిగిన అత్యాచారంగానే లెక్కించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన ప్రియుడితో లేదా భాగస్వామితో ప్రేమతో ఇష్టపూర్వకంగానే ఆమె శారీరక సంబంధంలోకి పోయినప్పటికీ ఈ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్యానానికి కారణమైన కేసు వివరాలలోకి వెళితే... పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన కుమార్ 16 ఏళ్ల వయసున్న బాలికతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తలిదండ్రులు మరోవైపున తమ కూతురును అపహరించి, అత్యాచారం చేశాడని కుమార్‌పై ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పంజాబ్ సెషన్స్ కోర్టు నిందితుడైన కుమార్‌కు ఏడే్ళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.


వినాయకుని ఆకారం... సంకేతాలు



బొజ్జ గణపయ్య ఆకృతిపై ఎన్నో రకాల చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం లాంటి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలుగా చెప్పుకోవచ్చు.వినాయకుడి ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉంటుందని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ఇష్టమైన అంశం.


ఓంకార రూపంలో రకరకాల ఆకృతుల్లో కొలువైన ఓంకార వినాయకుడి బొమ్మలు కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. ఎంతోమంది సృజనాత్మక కళాకారులు బొజ్జ గణపయ్య రూపాన్ని తమ కుంచెలతో ప్రతిష్టించారు.వినాయకుని తొండము "ఓం"కారానికి సంకేతం కాగా...ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము కాగా...చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము.


ఇంకా చదవండి

Thursday, April 3, 2008

కంత్రీ ట్రెయిలర్

వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న కంత్రి చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌గా పేరున్న అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా... దేశముదురు ఫేమ్ హన్సిక, బాలీవుడ్ కథానాయిక కాజోల్... సోదరి అయిన తనీషా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొన్ని విశేషాలున్నాయి.


దేశముదురు తర్వాత టాలీవుడ్‌కే రానని తేల్చి చెప్పిన హన్సిక.. తిరిగి రావడం ఒకటైతే.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేయటం మరో విశేషం...


మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి


Monday, March 24, 2008

స్వాగతం ట్రెయిలర్


కుటుంబ చిత్రాల కథానాయుకుడు జగపతిబాబు హీరోగా రూపొందిన 'స్వాగతం' చిత్రంలో భూమిక, అనుష్కలు హీరోయిన్‌లుగా నటించారు. సంతోషం ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆదిత్యారాం మూవీస్ పతాకంపై చిత్రీకరించారు.

ప్రేమ విలువను అత్యంత సున్నితంగా, మనస్సును కదిలించే విధంగా అటు మహిళలకు, ఇటు యువతరాన్ని కట్టిపడేసే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. జగపతిబాబు, అనుష్క, భూమికలు ఒకరికొకరు పోటీ పడుతూ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను కొన్ని ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.

నితిన్ కాజల్ ఆటాడిస్తా

తేజ సినిమా పతాకంపై ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆటాడిస్తా' చిత్రంలో నితిన్, కాజల్ హీరోహీరోయిన్‌లుగా నటించారు.

సి. కళ్యాణ్, ఎస్.విజయానంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చక్రి స్వరాలను సమకూర్చారు.నాగబాబు ఈ చిత్రంలో వైవిధ్యపాత్రను పోషించగా, సెక్సీ తార ముమైత్‌ఖాన్ ఓ పాటలో ప్రధానాకర్షణగా నిలువనుంది. లవ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గానే గాక యూత్‌ఫుల్ పిక్చర్‌గా...

మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి


Friday, February 29, 2008


ఆదాయపన్నుదారులపై కూడా ఆర్థిక మంత్రి చిదంబరం కరుణ చూపించారు. గత ఏడాది కేవలం పది వేలు మాత్రమే ఆదాయపన్ను పరిమితిని పెంచిన ఆర్థిక మంత్రి ఈ దఫా మాత్రం దానికి నాలుగు రెట్లు పెంచారు. 2008-09 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో విత్తమంత్రి పేర్కొన్నట్టుగా.. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితిని రూ.1.95 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు పెంచారు.


ఇకపోతే వివిధ పార్టీల జయాపజయాల్లో కీలక పాత్ర పోషించే మహిళల ఆదాయపన్ను పరిమితిని కూడా పెంచారు. వీరికి 1.50 లక్షల నుంచి రూ.180 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే కార్పోట్ ఆదాయపన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇదిలావుండగా..

కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా


కాలేజీకి వెళ్లే అమ్మాయిలు చీరకట్టుకుని ఆంటీలా వెళ్లకూడదు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలాగానే వెళ్లాలి. అలాగే చిత్రంలో మనం పోషించే పాత్రకు అనుగుణంగా, సందర్భోచితంగా వేషాధారణ వుండాలి అంటోంది ఈ బెంగుళూరు మోడల్. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..! ఆమే నండి "బొమ్మరిల్లు" భామ. జెనీలియా డిసౌజా.


ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో జెనీలియా బొమ్మరిల్లు చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే "సత్యం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ నటనకు రాకముందు మోడల్‌గా చేసేది. పార్కర్ పెన్నులు, ఫెయిర్ అండ్ లౌవ్లీ...

Wednesday, January 23, 2008

చిరంజీవి 'వందేమాతరం'


'వందేమాతరం... సుజలాం సుఫలాం మలయజ శీతలాం....' అన్న గీతం పాఠశాలల్లో ఒకనాడు అన్ని పాఠశాలల్లోనూ మారుమోగేది. కానీ నేడు కార్పొరేట్ కళాశాలల్లో చాలాచోట్ల వందేమాతరం ఆలాపన మచ్చుకైనా వినబడటం లేదు. 'వందేమాతరం' అన్న నినాదాన్ని వింటేనే స్వాతంత్ర్యయోధుల రక్తం పొంగుతుంది. అందులో అంత పవర్ ఉంది మరి. ఈ విషయాన్నే 'ఒక్కమగాడు'లో కూడా వృద్ధ సిమ్రాన్ పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు.


అసలు వందేమాతరం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.... మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వందేమాతరం అనబోతున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను ఎండగట్టేందుకు వందేమాతరం అనక తప్పదని ఆయన ఆలోచన కాబోలు. రోజురోజుకీ మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఎప్పుడు వచ్చినా ముందుగా అందుకు బీజం వేసే చిత్రం ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు.


చిరంజీవి నటించబోయే 149వ చిత్రం ఎలా ఉంటుందన్న నేపథ్యంలో...


ప్రేమకు నిర్వచనం కావాలా...?


ఏడాది క్రితం వరకు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నటి కిమ్ శర్మ అతనికి కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇటీవల యువరాజు పదుకునేతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలను విన్నదగ్గర్నుంచి కిమ్ కస్సుబుస్సులాడుతోందిట.


అంతేకాదండోయ్... ప్రేమంటే ఏమిటి? ప్రేమ విలువ ఎంత? ప్రేమ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందా...? వంటి అనేక ప్రశ్నలకు సుదీర్ఘమైన వివరణలు సైతం ఇస్తోందట. మొత్తం మీద దీపికా పదుకునే ప్రేమ వ్యవహారం కారణంగానే కిమ్‌ విరహవేదనకు...


Monday, January 7, 2008

భజ్జీపై నిషేధం ఎత్తివేయాలి: బీసీసీఐ


భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖండించింది. జాతి వివక్ష పట్ల తమ ఆటగాళ్లతో పాటు.. భారతదేశం తీవ్ర వ్యతిరేకమని పేర్కొంది. తమ ఆటాగాళ్లపై నిరాధారమైన జాతి వివక్ష ఆరోపణలు చేస్తే సహించబోమని బీసీసీఐ హెచ్చరించింది.


అంతేకాకుండా.. హర్భజన్ సింగ్‌పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాని ఎత్తివేయాలని ఐసిసిని విజ్ఞప్తి చేసింది. దీనిపై అప్పీలు చేయాల్సిందిగా జట్టు మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు ఉపాధ్యక్షుడు...


'ఓం శాంతి ఓం' భామ దెబ్బకు యూవీ బౌల్డ్


బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ దీపికా పదుకొనె చేసే ప్రతి పని సంచలనమే అవుతోంది. బాలీవుడ్‌ హీరో షారూక్ ఖాన్ నటించిన "ఓం శాంతి ఓం" చిత్రంలో తన నటనతో బాలీవుడ్ చిత్ర రంగాన్నే తనవైపుకు తిప్పుకున్న హీరోయిన్ పదుకొనె. అలాగే.. తాజాగా తన అందచందాలతో క్రికెట్ యువ హీరోలను తన వలలో వేసుకున్నట్టు వినికిడి. మొన్న 'జార్ఖండ్ డైనమెట్‌' ధోనీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈమె... నేడు 'సిక్సర్ల హీరో' యువరాజ్‌తో షికార్లు చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి.


ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న యూవీ ఆహ్వానం మేరకు.. పదుకొనె సిడ్నీకి వెళ్లడమే కాకుండా.. శుక్రవారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో పార్టీకి వెళ్లినట్టు ఆస్ట్రేలియా పత్రికలు కథనాలను ప్రచురించాయి. దీనిపై యూవీ సన్నిహితుడు ఒకరు స్పందిస్తూ.. యూవీ-పదుకొనె మధ్య స్నేహం...